పాపం.. మంచు మనోజ్: ఎంత బాధ పెట్టారో గానీ..!!

Manchu Manoj: మచ్ అవైటెడ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్.. భైరవం. ఈ మల్టీస్టారర్ మూవీ ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోంది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లీడ్ క్యారెక్టర్లల్లో నటించారు. తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె ఆదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, శరత్ లోహితాశ్వ, అజయ్, సందీప్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ కింద కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ కనకమేడల దర్శకుడు. తమిళం సూపర్ హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రమే ట్రైలర్ రిలీజ్ అయింది. రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో వారాహి అమ్మవారి ఆలయం ప్రధానాంశంగా తెరకెక్కింది.

Manchu Manoj breaks down during Bhairavam Pre release event

ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసిందీ ట్రైలర్. పైగా మంచు మనోజ్ గానీ, నారా రోహిత్ గానీ సుదీర్ఘ విరామం తరువాత నటిస్తోన్న మూవీ కావడం, వారికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తోడు కావడం వల్ల ఓ మంచి హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే అభిప్రాయాలు కలిగించినట్టయింది.

2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు తరువాత మంచు మనోజ్ నటించిన మూవీ ఇదే. మధ్యలో ఇది నా లవ్ స్టోరీ, ఆపరేషన్ 2019లో కనిపించినప్పటికీ అవి కామియో రోల్స్. పూర్తిస్థాయిలో లీడ్ క్యారెక్టర్ లో కనిపించాడిందులో మంచు మనోజ్. మోహన్ బాబు, విష్ణుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేశాడు

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం ఏలూరులో ఏర్పాటైంది. ఇందులో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజీ మీదే కన్నీరు పెట్టుకున్నాడు. ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని చెప్పుకొచ్చాడు.

మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప పైనా సెటైర్లు వేశాడు. కుటుంబ సభ్యులకు అన్యాయం చేసి.. శివయ్యను తలచుకుంటే ఆయన రాడని, మనసారా తలచుకుంటే దర్శకుడు, నిర్మాతలు, ప్రేక్షకులు, అభిమానుల రూపంలో వస్తాడని చెప్పాడు. అభిమానుల ప్రేమతో సెకెండ్ ఇన్నింగ్ ఆరంభించానని, నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+