ఫ్లవర్ కాదు ఫైర్: మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్..!!

నటి మంచు లక్ష్మి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప-2 సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో మనకు తెలిసిందే. అయితే ఈ మూవీస్ లోని చాలా డైలాగ్స్ కూడా ప్రేక్షకుల్ని విపతీరంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలోని ఓ ఫేమస్ డైలాగ్ తనదేనని మంచు లక్ష్మి తాజాగా తెలిపారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేచింది మహిళా లోకం చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు దర్శకుడు సుకుమార్ ఈ విషయం చెప్పాలని అన్నారు.

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటారు. ఆమె తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన 'లేచింది మహిళాలోకం' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న ఆమె ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ సృష్టించిన విషయం తెలిసిందే.

ManchuLakshmi Tollywood actres Claims Not Flower Fire Dialogue is Hers Viral Comment on Pushpa

అయితే ఈ మూవీలోని ఫేమస్ డైలాగ్ అయిన పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ఫైర్.. అంటూ అల్లు అర్జున్ చేసిన డైలాగ్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ డైలాగ్ పై తాజాగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ఈ డైలాగ్ తనదేనని తెలిపారు. ఈ మేరకు మంచు లక్ష్మి మాట్లాడుతూ.." డైరెక్టర్ సుకుమార్ కు నేను ఒక విషయం చెప్పాలి. 'ఫ్లవర్‌ కాదు ఫైర్‌' అనే డైలాగ్ ముందు నేనే చెప్పాను. మా సినిమా షూటింగ్ పుష్ప మూవీ రిలీజ్ కంటే ముందే పూర్తయింది. కానీ అప్పటికి మా డైలాగ్ బయటకు రాలేదు.. అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. పుష్ప సినిమాలో ఈ డైలాగ్ విని షాక్ అయినట్లు తెలిపారు.

ఇక మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ 'లేచింది మహిళాలోకం' సినిమా మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో మంచు లక్ష్మితో పాటు అనన్య నాగళ్ల, శ్రద్ధాదాస్‌, హరితేజ, హేమ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+