Mandaadi First Review: సముద్రంలో స్పోర్ట్స్ యాక్షన్ మెప్పించిందా..?

కోలీవుడ్ విలక్షణ నటుడు సూరి హీరోగా, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ విల‌న్‌ పాత్రలో నటిస్తున్న పాన్- ఇండియా చిత్రం 'మండాడి' ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ మూవీకి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో రాబోతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఆయనతోపాటు ఈ సినిమాకు ఎల్‌ రెడ్ కుమార్ నిర్మాతగా.. వీ మణికందన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ మూవీలో సూరి సరసన హీరోయిన్ గా మహిమా నంబియార్ నటిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, బాల శరవణన్, మిథున్, స్టన్ శివ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ ను సెన్సార్ సభ్యులు జారీ చేశారు. అంటే 16 ఏళ్లకుపైబడిన వారు ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు.

ఇక మండాడి మూవీ రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలు అంటే.. 154 నిమిషాలు ఉంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సముద్రంలో పడవ పందేలు హాలీవుడ్ సినిమా రేంజ్‌ లో ఉత్కంఠభరితంగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో సూరీ, సుహాస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా నటించినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని తీర ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ బోట్ రేస్ పోటీల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Mandaadi movie First review out of the sports action drama Mandaadi Did Suhas and Soori impress

ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ను అందించారు. సెప్టెంబర్ 10 న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను పెంచిన నేపథ్యంలో మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఉన్నారు. ఇక ఫుల్ రివ్యూ కోసం సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+