విజయ్ దేవరకొండ -రష్మిక పెళ్లికి హాజరయ్యే గెస్ట్ లిస్ట్ ఇదే ?
యంగ్ హీరో "విజయ్ దేవరకొండ" - స్టార్ బ్యూటీ "రష్మిక" జంట ఒక్కటి కాబోతుంది. ఇప్పటికే సందడి షురూ అవ్వగా.. పెళ్లి భాజాలు మోగేందుకు సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన మోస్ట్ లవ్డ్ కపుల్ వివాహ వేడుకతో ఏడడుగులు వేసేందుకు సిద్దమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యూట్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్నారు. ఫిబ్రవరి 23నే ఈ జంట కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ప్రీ-వెడ్డింగ్ వేడుకలను స్నేహితులు, సన్నిహితుల మధ్య మొదలుపెట్టింది. పూల్ పార్టీ, క్యాండిల్‌లైట్ డిన్నర్ అంటూ ఫుల్ పార్టీ మోడ్ లో ఎంజాయ్ చేసేస్తున్నారు.
ఈ జంట పెళ్లి వేడుకకు ఉదయ్‌పూర్‌లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ హోటల్ వేదికైంది. ఫిబ్రవరి 22న ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించింది. అభిమానులు తమకు పెట్టిన 'విరోష్' పేరునే తమ పెళ్లికి పెట్టుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ రోజు (ఫిబ్రవరి 24) మెహందీ, రేపు (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా పెళ్లి నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు గాను 26న జరిగే వివాహానికి కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని, రెండు కుటుంబాల నుంచి చెరో 100 మంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకల కోసం డచ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్యాలెస్‌ను అలంకరించనున్నారని, ప్రముఖ డిజైనర్లతో వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ రూపొందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక అతిథులు..
ఈ వివాహానికి విజయ్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన దర్శకులు Tharun Bhascker, Sandeep Reddy Vanga ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని సమాచారం. అలాగే Nag Ashwin కూడా ఆహ్వానం అందుకున్నప్పటికీ షూటింగ్ కారణంగా హాజరుపై అనిశ్చితి నెలకొంది. ఉదయ్‌పూర్‌లో జరిగే పెళ్లికి రాలేని ఇండస్ట్రీ మిత్రుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముంది. మీడియా మిత్రుల కోసం ప్రత్యేక మీట్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
కెరీర్ పరంగా ఇద్దరూ బిజీ..
మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించిన విజయ్ Pelli Choopulu తో హీరోగా గుర్తింపు తెచ్చుకుని, Arjun Reddy తో స్టార్‌డమ్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.












Click it and Unblock the Notifications