మస్తాన్ సాయి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్.. చనిపోతానని బ్లాక్ మెయిల్
మస్తాన్ సాయి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. అయితే విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మస్తాన్ సాయి ఉరి వేసుకొని చనిపోతానంటూ మహిళల్ని బెదిరించిన వీడియో వైరల్ గా మారింది.
మస్తాన్ సాయి వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో పోలీసులకు కంప్లైంట్ చేయటానికి వెళుతుంటే.. ఫ్యాన్ కు ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో వందల సంఖ్యలో మహిళలను వేధించిన మస్తాన్ సాయి.. వారందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ తన అరాచకాలు కొనసాగించాడు.

వంద మందికి పైగా మహిళలను ట్రాప్ చేసిన మస్తాన్ సాయి.. వారిని అనుభవించడమే కాకుండా... వీడియోలను కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫైర్ ఉందని రాజ్ తరుణ్ తో సహా పలువురు ఆరోపించారు. కానీ మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ మొదట్లో చెప్పిన లావణ్య... చివరికి హార్డ్ డిస్క్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం హాట్ టాపిక్ గా మారింది.
మహిళల ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ అకౌంట్, గూగుల్ ఫొటోస్, ఐ క్లౌడ్ అకౌంట్స్ ను తన ఆధీనంలో పెట్టుకొని వారిని ఎదురు తిరగలేని స్థితికి తీసుకొచ్చాడని పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది. ఒక్కో అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా ప్లే చేస్తూ చచ్చిపోతానంటూ బెదిరించి వాళ్లు పోలీసుల వరకు వెళ్లకుండా చేశాడు అంటూ ఫైర్ అయ్యింది.
ఇక తనపై కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపించిన లావణ్య.. హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ప్రముఖ హీరోకు సంబంధించిన వీడియోలు, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications