Love You.. మొత్తానికి అతనిపై ఓపెనైన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత ఇండస్ట్రీలో యాక్టివ్ కావడానికి మళ్లీ ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.
అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విడాకుల అనంతరం కొంతకాలం సైలెంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇండస్ట్రీలో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన 'కమిటీ కుర్రాళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం నిహారిక సంగీత్ శోభన్‌ను హీరోగా పెట్టి రెండో సినిమాను నిర్మాతగా మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే నిహారిక తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ రోజు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్పింది.
హ్యాపీ బర్త్ డే బావ లవ్ యూ అని చెప్తూ రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా షేర్ చేసింది. ఇది చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక బావను సెట్ చేసుకోమని కొందరు హితవు పలుకుతున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications