మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ పెళ్లి ఫిక్స్.. కాబోయే భార్య ఎవరంటే?

మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గా తేజ్) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. సాయి దుర్గా తేజా ఎంగేజ్మెంట్ వేడుక నవంబర్ 5వ తేదీన చాలా నిరాడంబరంగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తమిత్రుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. సాయి దుర్గా తేజ్ పెళ్లి చేసుకోబోయేది తన చిన్ననాటి స్నేహితురాలినేనని సమాచారం. అయితే ఆ అమ్మాయి వివరాలు, ఆమె పేరును మాత్రం రహస్యంగా ఉంచడంతో ఆ కాబోయే వధువు ఎవరనే దానిపై సర్వత్రా కుతూహలం నెలకొంది.

Mega Hero Sai Durga Tej Marriage Who Is the Bride Mega Hero Engagement Rumours Create Buzz Details

ఇక పెళ్లి డేట్ విషయానికి వస్తే.. డిసెంబర్‌లోనే వివాహం జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుండగా.. మరికొన్ని నివేదికలు మాత్రం 2027 ప్రారంభంలో పెళ్లి జరిగే అవకాశం ఉందంటున్నాయి. ఇప్పటివరకూ ఈ నిశ్చితార్థం లేదా వెడ్డింగ్ వార్తలపై సాయి దుర్గా తేజ్ కానీ, మెగా కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరో బిగ్ మల్టీస్టారర్‌.. ఇద్దరు స్టార్ హీరోలతో మణిరత్నం బిగ్ సర్‌ప్రైజ్!
మరో బిగ్ మల్టీస్టారర్‌.. ఇద్దరు స్టార్ హీరోలతో మణిరత్నం బిగ్ సర్‌ప్రైజ్!

గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన సాయి దుర్గా తేజ్.. 2026 నాటికి తను వివాహ బంధంలోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు పరోక్షంలో పేర్కొన్నారు. నవంబర్ 5వ తేదీ సమీపిస్తుండటంతో త్వరలోనే సాయి దుర్గా తేజ్ లేదా మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+