ఒకే పెళ్లికి హాజరైన చిరంజీవి, అల్లు అర్జున్... ఏం జరిగిందంటే?
మెగా స్టార్ చిరంజీవి కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థిత ఉందనే సంగతి తెలిసిందే. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు, బన్నీ అభిమానులు హోరాహోరీ యుద్ధానికి తలపడుతున్నారు. కొన్నాళ్ల నుంచి అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు కాస్తా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి తారస్థాయికి చేరుకున్నాయి. పుష్ప2 టికెట్ ధరల పెంపునకు పవన్ అనుమతిచ్చిన తర్వాత బహిరంగంగా అల్లు అర్జున్ థాంక్స్ బాబాయ్ అని చెప్పారు. దీంతో ఈ రెండు కుటుంబాలమధ్య గొడవలు సద్దుమణిగినట్లేనని భావించారు. అయితే పుష్ప2 సినిమాపై మెగా హీరో ఒక్కరు కూడా స్పందించలేదు సాయిధరమ్ తేజ్ మినహాయ
రెండు కుటుంబాలకు కావల్సిన వ్యక్తి
ఇటువంటి సమయంలో చిరంజీవి, అల్లు అర్జున్ ఒకే వివాహానికి హాజరయ్యారు. సంజన బీరపల్లి అనే అమ్మాయిది వివాహం జరగ్గా చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం హాజరైంది. ఈ అమ్మాయి తండ్రి ఈ రెండు కుటుంబాలకు బాగా కావల్సిన వ్యక్తి. రెండు కుటుంబాలకు చెందిన సభ్యులంతా హాజరయ్యారుకానీ కలిసి ఎక్కడా ఒక్క ఫొటో కూడా దిగలేదు. ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. ఒకే పెళ్లికి హాజరుకావడంతో ఇద్దరూ మాట్లాడుకుంటుంటారని అందరూ భావించారు. అయితే అక్కడ అదేమీ జరగలేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ పెళ్లిక సంబంధించిన ఫొటోను మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ షేర్ చేసింది.

దిగివచ్చిన నిర్మాతలు.. స్వల్పంగా తగ్గిన ధరలు
పుష్ప2 విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న తరుణంలో మెగా కుటుంబానికి సంబంధించినవారెవరూ స్పందించలేదు. అందరూ మౌనంగానే ఉన్నారు. నాగబాబు మాత్రం సినిమాను సినిమాగానే చూడాలనే కామెంట్ చేశారు. టికెట్ ధరలు బాగా ఎక్కువగా ఉండటంతో సోమవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరలను తగ్గించారు. నిర్మాతలు అత్యాశకు పోయి బారీ ధరలకు అనుమతులు తెచ్చుకోవడంతో థియేటర్లకు శని, ఆదివారాల్లో కూడా ప్రేక్షకులెవరూ వెళ్లలేదు. థియేటర్లేవీ హౌస్ ఫుల్ అవలేదు. దీంతో నిర్మాతలు దిగివచ్చి ధరలు తగ్గించారుకానీ అవి కూడా స్వల్పంగానే ఉన్నాయి. ఒక సినిమా చూడాలంటే 1200 నుంచి రూ.800 వరకు ఖర్చుపెట్టడం అవసరమా? అనే చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications