మరోసారి నోరు జారిన చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి నోరుజారి చిక్కుల్లో పడ్డారు. రాజకీయాలు వదిలిపెట్టి తిరిగి సినిమా రంగంలోకి రెండోసారి అడుగుపెట్టిన తర్వాత ఆయన గ్రహబలం బాగున్నట్లు లేదు. తరుచుగా విమర్శలపాలవుతున్నారు. సినీ, రాజకీయ విమర్శకుల చేతికి చిక్కుతున్నారు. సినిమా వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న చిరంజీవి ఆయా సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు.. ఆయన్ను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేస్తున్నాయి. తమ హీరో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడా? అంటూ మెగా అభిమానులు కలవరపడుతున్నారు. ఇటీవలే బ్రహ్మానందం సినిమా వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.
తన ఆశయాలు పవన్ కల్యాణ్ తీరుస్తాడు
తాజాగా ఓ సినిమా వేడుకలో పాల్గొన్న చిరు జై జనసేన అన్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ట్రోల్ చేస్తున్నారు. రాజకీయాలకు దూరం అని చెప్పిన చిరంజీవి ఇప్పుడు తమ్ముడి పార్టీకి మద్దతు పలకడం ఏమిటని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జై జనసేన అనడం ఏమిటంటూ వైసీపీ తీవ్ర విమర్శల దాడిచేస్తోంది. బీజేపీకి చిరు దగ్గరవుతున్నారని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి సిద్ధంగా ఉందంటూ వార్తలు వస్తే చిరు వాటిని ఖండించారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమని, సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేస్తానని, రాజకీయంగా తనకున్న ఆలోచనలు, ఆశయాలు తన తమ్ముడు పవన్ కల్యాణ్ ద్వారా తీర్చుకుంటానని చెప్పారు.

చిరంజీవిపై కిరణ్ బేడీ విమర్శల దాడి
చిరంజీవిపై తాజాగా మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ కూడా కామెంట్స్ చేసింది. ఆడపిల్లలను మంచి పెంచాలని, అంతేకాకుండా మంచిగా పెంచుతున్న తల్లిదండ్రులను చూసి నేర్చుకోండంటూ చాలా గట్టిగా చెప్పారు. కిరణ్ బేడీ ఇలా మాట్లాడటానికి కారణం.. బ్రహ్మాఆనందం సినిమా వేడుకలో తనకు మనవడు కావాలని ఉందని, కానీ కూతురును కంటారేమోననే అనుమానంద ఉందని వ్యాఖ్యానించారు. తన ఇల్లు లేడీస్ హాస్టల్ లా ఉంటుందని, ఆ హాస్టల్ కు తాను వార్డెన్ లా ఉంటున్నానని చెప్పారు. దీనిపై భారీగా విమర్శలు వచ్చాయి. అయితే చిరు చాలా సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించాల్సిన అవసరంలేదని, పనికట్టుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మెగా అభిమానులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications