తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. కారణం అదే !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు రాత్రి ( జూలై 29, 2025 ) మర్యాదపూర్వకంగా కలిశారు. రాత్రి 8 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికార నివాసానికి వెళ్లారు చిరంజీవి. ఈ సందర్భంగా ఇద్దరూ పలకరించుకుంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సీఎంఓ అధికారిక వీడియో పోస్ట్..
ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎంఓ అధికారికంగా 'ఎక్స్ 'వేదికగా పోస్ట్ చేసింది. వీడియోలో చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా సంభాషణ జరగటం కనిపిస్తుంది. చిరంజీవి ఈ కారణంతో ముఖ్యమంత్రిని కలిశారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పలువురు విశ్లేషకులు మాత్రం మర్యాదపూర్వక భేటీ కావచ్చని.. లేదా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల 'వాల్తేరు వీరయ్య'తో మంచి హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా 'విశ్వంభర'చిత్రంలో నటిస్తున్నారు. 'బింబిసార'తో తనకంటూ ప్రత్యేక గుర్తింప తెచ్చుకున్న వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.
ఈ మూవీలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష, అషికా రంగనాథ్ నటిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా కలిశారు. @KChiruTweets pic.twitter.com/lUx2dX9u02
— Telangana CMO (@TelanganaCMO) August 3, 2025












Click it and Unblock the Notifications