Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాలకు దూరం.. సోషల్‌ మీడియాలో విమర్శలపై ఓపెన్ అయిన మెగాస్టార్ !

ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పాటు యంగ్ హీరో తేజా సజ్జా కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రక్తదానం అనే పదం వినగానే తన పేరు గుర్తొస్తే అది పూర్వజన్మ పుణ్యమని హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తేజా సజ్జాను "నా బిడ్డ లాంటి వాడు" అంటూ అభినందించారు.

రాజకీయాలకు దూరమే..

అంతే కాకుండా తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొంతమంది నేతలు నన్ను విమర్శించారని వారికి తన మంచితనమే సమాధానమన్నారు.

megastar-chiranjeevi-shocking-comments-on-blood-donation-drive-at-hyderabad

సోషల్ మీడియా విమర్శలపై రియాక్ట్..

సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా చిరంజీవి నోరు విప్పారు. తనపై విమర్శల పట్ల స్పందించనని.. ఎందుకంటే చేసిన మంచి, అభిమానుల ప్రేమే తనకు రక్షణ కవచం అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ రాజకీయ నాయకుడు తనపై అసభ్యంగా వ్యాఖ్యానించాడని చిరు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నాయకుడు ఓ ప్రాంతానికి వెళ్లినప్పుడు.. ఓ మహిళ అతడిని అడ్డుకుని "చిరంజీవిని ఎందుకు తిట్టారు?" అని ప్రశ్నించిందని చెప్పారు. తన బిడ్డకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ప్రాణాలు నిలిచాయని.. అందుకే ఆయనంటే గౌరవం అని చెప్పారన్నారు. ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఒక జర్నలిస్ట్‌ కారణంగానే..

ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక కథను వెల్లడించిన చిరంజీవి.. ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్‌ చదివిన తర్వాతే ఆ ఆలోచన తనలో వచ్చిందని చెప్పారు. అంతే కాకుండా ఆయన్ని ఇప్పటివరకు కలవలేదు గాని.. ఆ ఆర్టికల్‌ వల్లే నేను ఈ మార్గంలోకి వచ్చానని తెలిపారు. ఆయన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఎమోషనల్ అయ్యారు. తన అభిమానులు విదేశాల్లో కూడా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని సేవ కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరోవైపు చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆయన్ని బరిలోకి దింపాలన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఉంది. దాంతో రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ఇప్పుడు చిరు చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+