మెగా ఫ్యాన్స్‌కి డబుల్ బోనాంజా.. పవన్ మూవీ షూటింగ్‌లో చిరు !

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేస్తున్నారు. ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న "ఓజీ" మూవీలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేసేశారు.

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ సమయంలో అనుకోని అతిథి గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.

megastar-chiranjeevi-visits-pawan-kalyan-usthad-bhagath-sigh-movie-shooting

అసలు ఏం జరిగిందంటే..?

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి సెట్‌లో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. పవన్ పక్కనే ఉండి మానిటర్‌లో షాట్‌ను చూస్తున్నఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ మళ్లీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానుల ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. తొలి భాగం " స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ " పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేశారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దాదాపు 14 సార్లు వాయిదా పడి ఆ విషయంలో కూడా రికార్డు సృష్టించింది ఈ మూవీ. కాగా ఎట్టకేలకు జూలై 24న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+