కలలో కూడా ఊహించని కాంబినేషన్: కొరటాల శివకు ఓకే చెప్పిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 విజయాన్ని ఆస్వాదించే పరిస్థితిలో లేరు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, మహిళ మృతి చెందడం, ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుండటం, అరెస్ట్ అవడం, బెయిల్ పై బయటకు రావడంలాంటి సంఘటనలన్నీ వరుసగా జరిగిపోయాయి. తన తర్వాత సినిమామీద ఇప్పుడిప్పుడే దృష్టిపెడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానరుపై రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేయబోతున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కాగానే షూటింగ్ మొదలుపెడతారు.

ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్ తో..
తాజాగా దేవర చిత్ర దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రాంతానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ తో ఈ కథను తయారుచేశారు. పుష్ప2 కూడా బీహార్, ఉత్తరప్రదేశ్ లో సినిమా బాగా ఆడింది. దీంతో ఆ ప్రాంత నేపథ్యంలో కొరటాల కథను తయారు చేయడం, బన్నీ వినడం, ఓకే చేయడం జరిగిపోయాయి. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలని అల్లు అర్జున్ కొరటాలను కోరడంతో ప్రస్తుతం ఈ దర్శకుడు ఆ పనిమీదే ఉన్నాడు.

mind blowing combination allu arjun and director koratala siva movie will come

బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమన్న అల్లు అర్జున్
వాస్తవానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటివారితో సినిమాలు చేయాల్సి ఉంది. కథలు కూడా ఓకే అయ్యాయి. మధ్యలో కొరటాల కథ వచ్చింది. ఇది బాగా నచ్చడంతో త్రివిక్రమ్ సినిమా తర్వాత దీన్ని చేసే అవకాశం ఉందంటున్నారు. ఈలోగా దేవర2కు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ ను కొరటాల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేవర మొదటి భాగం అంచనాలను అందుకోలేకపోవడంతో దేవర2 చేయాలా? వద్దా? అనే సందిగ్ధత వెంటాడుతోంది. మొత్తం కథను ఒకే సినిమాగా చెప్పివుంటే కనీసం రూ.1200 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టేది. కానీ దర్శకుడిగా శివ విఫలం కావడంతో దాన్ని అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ మీద సినిమా రూ.550 కోట్ల వరకు తీసుకురాగలిగాడు. దేవర2 ఉంటుందా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+