"బిగ్ మిస్టేక్".. రూ.500 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాలో ఇది గమనించారా..?

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "కాంతార చాప్టర్ 1". గతంలో సంచలన విజయం సాధించిన 'కాంతార'కి మునుపటి కథగా ఈ చిత్రం తెరకెక్కింది. కాంతార కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉండగా.. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా.. జయరాం, గుల్షన్ సహా పలువురు నటులు కీలకపాత్రలు పోషించారు. రీసెంట్ గానే ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించింది.

ఇప్పటికే పలు రికార్డ్స్ తిరగరాసిన ఈ మూవీ 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది. త్వరలోనే ఛావా సినిమా రూ.600 కోట్ల రికార్డును ధాటి మొదటి సినిమాగా టాప్ స్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే థియేటర్లలో హౌస్ పుల్ బోర్డులతో దూసుకుపోతున్న ఈ చిత్రం సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశంలో బిగ్ మిస్టేక్ ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

mistake-in-kantara-chapter-1-movie-got-trolled-in-social-media

మిస్టేక్ ఏంటంటే..

ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో.. గుడిలో శివలింగం ప్రతిష్టించిన తర్వాత సన్నివేశం భోజనాల కార్యక్రమం ఉంటుంది. అప్పుడు అందరూ భోజనం చేస్తుండగా ఓ పక్కన వాటర్ క్యాన్ కనిపిస్తుంది. అది కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఎవరూ గుర్తించలేరని చెప్పవచ్చు. కానీ ఆ కాలంలో వాటర్ క్యాన్ అంటే నమ్మలేని విషయం కాబట్టి.. షూటింగ్ సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా చూసుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

mistake-in-kantara-chapter-1-movie-got-trolled-in-social-media

ఇక ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా చేయాలని అనుకోలేదట. దర్శకత్వం వరకు చూసుకుంటే చాలని అనుకున్నారట. ఆయన ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని భావించారట. అయితే ఓసారి ఎన్టీఆర్ ని కలిసి ఈ సినిమా స్టోరీని వినిపించగా.. ఆయనకు బాగా నచ్చిందట కానీ అదే సమయంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో ఉండడం, తదుపరి చిత్రం దేవర కు కూడా డేట్స్ ఇచ్చేయడం కారణంగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వదులుకోవాల్సి వచ్చిందట.

మరోవైపు కాంతార చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనూహ్య ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్సు కర్ణాటకలోని ముడూరులో బోల్తాపడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా ప్రాణాలతో బయటపడినప్పటికీ.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకే గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ కూలిపోయింది.

అలానే కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి గల్లంతయై శవంగా తేలాడు. అనంతరం కొద్దిరోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడి పెళ్లికి హాజరై మెహిందీ ఫంక్షన్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మరో నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+