మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు..!
టాలీవుడ్ ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటీవల ఫుల్ బిజీ అవుతున్నారు. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు. అలాగే అలాగే అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమాలోనూ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు మోహన్ బాబు. కెరీర్ బిగినింగ్స్ లో చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు మోహన్ బాబు. అయితే చాలా ఏళ్ల తర్వాత మరోసారి విలన్ గా తన మార్క్ టైమింగ్, యాక్టింగ్ కు ఈ తరానికి పరిచయం చేసే పనిలో ఉన్నారు. అందువల్లనే ఇటీవల వరుస సినిమాలతో మోహన్ బాబు బిజీగా ఉన్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మెగా 158 అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ ఎంతో అలవోకగా హుక్ స్టెప్ వేసి.. అందరినీ ఆశ్చర్య పరిచారు చిరు. ఇప్పుడు అదే ఉత్సాహంతో బాబీ కొల్లి సినిమాలో ఓ యాక్షన్ పాత్రలో మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు.
అయితే ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అది విలన్ పాత్రా.. లేక కథను మలుపు తిప్పే కీలక పాత్రా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం మోహన్ బాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఇక ఈ విషయంపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. ఏదేమైనా చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి- మోహన్ బాబు ఒకే సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో అటు మెగా ఫ్యాన్స్.. ఇటు మంచు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఇక చిరంజీవి హీరోగా బాబీ ఇప్పటికే 'వాల్తేర్ వీరయ్య' సినిమాను తెరకెక్కించారు. 2023 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుంది. ఇక ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications