అత్యాచారం కేసులో 'మోనాలిసా' డైరెక్టర్ అరెస్ట్.. హీరోయిన్ ను చేస్తానని చెప్పి పలుమార్లు..

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ ను చేస్తానని మాయమాటలు చెప్పి ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు అతడ్ని సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఓ గ్రామానికి చెందిన యువతిని హీరోయిన్ చేస్తానని మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి సనోజ్ మిశ్రా పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆ యువతిని 2020లో టిక్ టాక్ లో పరిచయం అయ్యాడు. వీడియోలు బాగున్నాయి.. హీరోయిన్ ను చేస్తానని నమ్మించాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పలుమార్లు యూపీలోని జాన్సీ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరూ రహస్యంగా కలుసుకునేవారు.

Monalisa Director Sanoj Mishra Arrested on Rape Charges

తనతో సెక్స్ చేయకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరించి.. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆమెకు మత్తుమందు ఇచ్చి కూడా చాలా సార్లు దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ బాధితురాలు పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం మేరకు డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

Take a Poll

ఇక మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అలా ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మోనాలిసా ను చూసిన సనోజ్ మిశ్రా ఆమెకూ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు సనోజ్ మిశ్రా వద్దే ఆమె యాక్టింగ్ పై శిక్షణ పొందుతోంది. అయితే తాజాగా సనోజ్ మిశ్రా నిజస్వరూపం బయట పడడంతో ఆమె కెరీర్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సనోజ్ మిశ్రా.. మోనాలిసా ప్రధాన పాత్రలో ది డెయిరీ ఆఫ్ మణిపుర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సనోజ్ మిశ్రా అరెస్ట్ తర్వాత మోనాలిసా పరిస్థితి ఏంటో నని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+