పవన్ ను చూస్తుంటే రక్తం మరుగుతోంది: తమన్ సంచలనం
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా ఒకటే మాట ఓజీ.. ఓజీ.. ఆయన స్టేజీ ఎక్కితే చాలు ఫ్యాన్స్ ఓజీ.. ఓజీ.. అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆయన ఎన్నో సార్లు అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం ఓజీ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా..? తమ అభిమాన హీరోను గ్యాంగ్ స్టర్ పాత్రలో చూస్తామా..? అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఏపీ సంక్షేమం, రాజకీయాలపై పవన్ దృష్టి పెట్టడంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతోంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంతో పాటు హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాల కంటే ముందే ఓజీ చిత్రం విడుదల కానున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న తమన్.. తాజాగా ఓజీ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమన్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
తమన్ ఓజీ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓజీ మ్యూజిక్ పై ప్రశ్న అడగ్గా.. తమన్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు." పవన్ కల్యాణ్ ను ఓజీ పాత్రలో చూస్తుంటే నా రక్తం మరుగుతోంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడుతుంటే రక్తం ఉరకలేస్తోంది. పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ చాలు పిచ్చి ముదిరి పీక్స్ కు చేరడానికి. నేను అన్ని మ్యూజిక్ పరికరాలను మారుస్తున్నా ఈ సినిమా కోసం. రూమ్ నిండా పవన్ కల్యాణ్ పోస్టర్స్ తో నింపేశాను ఎనర్జీ తగ్గకుండా ఉండేందుకు. ఓజీ మ్యూజిక్ మీ ఊహకు అందనంతలా ఉండేందుకు కృషి చేస్తున్నా" అని తమన్ చెప్పుకొచ్చాడు. ఆయన వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు తమన్ మ్యూజిక్ విందామా..? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో పవన్ కల్యాణ్ 'ఓజాస్ గంభీర' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగుతెరకు పరిచయం కానున్నారు. దీంతో ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీలో బ్యూటీ ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది.












Click it and Unblock the Notifications