చంద్రబాబు సీఎం అయ్యారంటే పవన్ కల్యాణ్ దయతోనే...నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్
జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్ చేశారు.చంద్రబాబు సీఎం అవ్వడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు సీఎం అయ్యారంటే అది పవన్ కళ్యాణ్ వల్లనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు కూటమిలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన ,టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. వాళ్లు భావించినట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో జనసేన ,టీడీపీ పార్టీల మధ్య చిచ్చు మొదలైంది. జనసేన ,టీడీపీ పార్టీల మధ్య పదవుల చిచ్చు రేగింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికల సమయంలో తనని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని చేయకపోవడంతో పిఠాపురం టీడీపీ నేత వర్మ అసహనం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయారు వర్మ. ఇప్పటి వరకు రెండుసార్లు ఎమ్మెల్సీ జాబితా రిలీజ్ చేయగా , రెండుసార్లు ఆయనకు మొండి చేయి ఎదురైంది. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మరీ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.
చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూనే , తాను చెప్పాల్సింది చెప్పేశారు. 27 ఏళ్లుగా చంద్రబాబు చెప్పింది చేశానని, గత ఎన్నికల్లో కూడా ఆయన చెప్పడం వల్లే సీటు దక్కకపోయినా పని చేశానని పరోక్షంగా పవన్ కల్యాణ్ గెలుపు గురించి ప్రస్తావించారు.మరోవైపు వర్మకు ఎమ్మెల్సీ రాకుండా జనసేన నాయకులే అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నాదెండ్ల మనోహర్ చంద్రబాబు సీఎం అయింది పవన్ కల్యాణ్ వల్ల అంటూ కామెంట్స్ చేశారు. నాదెండ్ల చేసిన ఈ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications