బిగ్ షాక్: పెళ్లికి ముందే నాగచైతన్య-శోభిత మధ్య గొడవలు?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. సహ నటి శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రింద అక్కినేని నాగార్జున ట్విటర్ ద్వారా తెలిపారు. దీంతో పరిశ్రమ సహా అందరికీ షాక్ తగిలినట్లైంది. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కలిసి ప్రైవేట్ పార్టీలకు హాజరవుతున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. చివరకు ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారు.
వివాహానికి ముందే గొడవ
తాజాగా శోభిత ధూళిపాళ తన కుటుంబ సభ్యులతో కలిసి పసుపు దంచే కార్యక్రమాన్ని చేసింది. ఈ ఫొటోలు షేర్ చేయడంతో త్వరలో పెళ్లి జరగబోతోందని అందరికీ అర్థమైంది. అయితే వివాహానికి ముందే వీరిద్దరి మధ్య ఒక విషయంలో గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. వివాహమైన తర్వాత తన ఫ్లాట్ లో కాపురం పెడదామని నాగచైతన్య శోభితకు చెప్పారు. అయితే ఆమె దానికి అంగీకరించలేదు. ఎందుకంటే సమంతను వివాహం చేసుకున్నప్పుడు కాపురం కోసం నాగచైతన్య ఎంతో ముచ్చటపడి దాన్ని కొనుగోలు చేశారు. తన అభిరుచులకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. విడిపోయేంతవరకు సమంత-నాగచైతన్య అందులోనే కాపురం చేశారు.

సమంత జ్ఞాపకాలే వెంటాడతాయి
అయితే ఇప్పుడు అందులో కాపురం చేయడం అంటే తనవల్ల కాదు అని శోభిత స్పష్టంగా చెప్పేసినట్లు తెలుస్తోంది. అందులో ఉన్నప్పటి నుంచి నాగచైతన్యకు సమంత జ్ఞాపకాలే వస్తాయని, తనపై ఏకాగ్రత కుదరదని, అక్కడ ఇద్దరం సంతోషంగా ఉండలేమని చెప్పేసింది. తాను ఆ ఫ్లాట్ ను ఎంతో ప్రేమగా, తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేయించుకున్నానని, అక్కడ కాపురం పెడితే బాగుంటుందని సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. దీనిపై వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కినేని నాగార్జున జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. వాస్తవానికి ఇందులో నిజమెంతో తెలియదుకానీ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం ప్రచారంలో ఉండటమే కాదు వైరలవుతోంది.












Click it and Unblock the Notifications