కొత్త నాలుగేళ్ల వీసా ఆంక్షలతో అమెరికాకు నష్టం..నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం!

యూఎస్ లో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విద్యార్థులకు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త నాలుగేళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం - అమెరికా కాంగ్రెస్, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ - USCIS లను కోరింది.

కొత్త నాలుగేళ్ల వీసా ఆంక్షలపై భారతీయ డయాస్పోరా న్యాయవాదుల బృందం

ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్లు అవుతుందని న్యాయవాద బృందం ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పరిశోధక విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంది.

US visa news FIIDS has urged the US Congress and the USCIS to halt the new four year visa restrictions on foreign students

విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ లేకుండా చేయటంపై ఆందోళన

ఇంతకు ముందు యూఎస్ లో విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం ఉండేది. ఇందులో డాక్టరేట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి కోర్సులు పూర్తి చేయటానికి నాలుగేళ్ళకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కొత్తగా విద్యార్థులు, సందర్శకులపై విధించదలచిన ఈ నాలుగేళ్ల వీసా నిబంధనపై భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం ఆందోళన వ్యక్తం చేసింది.

ఆంక్షలను నిలిపి వెయ్యాలని డిమాండ్

ఈ ఆంక్షలను నిలిపివేయాలని, గ్రాడ్యుయేట్ స్టెమ్ ప్రోగ్రాం లకు వీసా పొడిగింపులు ఇవ్వాలని, అలాగే opt ప్రోగ్రాంలకు కూడా ఈ నాలుగేళ్ల వీసా ఆంక్షల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరింది. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.

అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17 శాతం డౌన్ ఫాల్

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళనల కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17 శాతం మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని FIIDS పేర్కొంది. ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ఈ విషయంలో తనదైన శైలిలో పోరాటం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+