బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు పట్టేసిన తెలుగు హీరో.. అల్లు అర్జున్ తర్వాత

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం నటనపై ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనదైన ముద్ర వేస్తున్న యువ కెరటం రాగ్ మయూర్. ముంబై వేదికగా ఎంతో వైభవంగా జరిగిన 'నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్' వేడుకలో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొని తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో సగర్వంగా ఎగురవేశారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సివరపల్లి'లో ఆయన పోషించిన అత్యంత సహజమైన, హృదయానికి హత్తుకునే పాత్రకు గానూ ఈ అరుదైన అవార్డు తనను వరించింది.

దేశవ్యాప్తంగా వినోద రంగానికి చెందిన మహామహులు హాజరైన ఈ వేడుకలో రాగ్ మయూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ సినీ రంగానికి చెందిన దిగ్గజ నటులు మనోజ్ బాజ్‌పేయి, బొమన్ ఇరానీ లాంటి ఉద్ధండులతో... దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే వంటి ప్రముఖులతో ఒకే వేదికను పంచుకోవడం విశేషం. బాలీవుడ్ అగ్ర నటుల సమక్షంలో ఓ తెలుగు యువ నటుడు ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం, అక్కడున్న ప్రముఖుల ప్రశంసలు పొందడం తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ పరిణామంగా చెప్పవచ్చు.

Raag Mayur Wins Best Actor at NEXA Streaming Academy Awards for Sivarapalli Full Details

తెలుగు ప్రాంతీయ మూలాలున్న కథలకు, ఇక్కడి మట్టి పాత్రలకు జాతీయ స్థాయిలో ఎంతటి ఆదరణ లభిస్తోందో చెప్పడానికి రాగ్ మయూర్ సాధించిన ఈ విజయమే నిదర్శనం. కంటెంట్ బలంగా ఉండి, పాత్రలో జీవించే తత్వం ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు గుండెల్లో గుడి కడతారు. 'సివరపల్లి' వెబ్ సిరీస్‌లో గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలో రాగ్ మయూర్ ఒదిగిపోయిన తీరు, ఆయన పండించిన హావభావాలు, నటనలోని సహజత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రేక్షకులను, విమర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

'సినిమా బండి' సినిమాతో తనలోని నటుడిని పరిచయం చేసి ఆపై వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న రాగ్ మయూర్... నేడు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలవడం సాధారణ విషయం కాదు. పరిమితులు, ప్రాంతీయ పరిధులను దాటి, కేవలం అంకితభావం, నటనపై ప్రేమే ఆయుధంగా దూసుకుపోతున్న ఆయన ప్రయాణం... స్వయంకృషినే నమ్ముకొని ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న ఎంతో మంది యువ నటులకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. మన 'సివరపల్లి' కుర్రాడు ముంబై వేదికపై బెస్ట్ యాక్టర్‌గా మెరవడం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి గర్వకారణం. రాగ్ మయూర్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+