నో మీన్స్ నో..: రిటైర్మెంట్ పై తేల్చి చెప్పిన రోహిత్ భాయ్

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ కు పరాజయం తప్పలేదు. చివరి వరకూ పోరాడినా కూడా ఓటమి కోరల నుంచి తప్పించుకోలేకపోయింది. 27 పరుగుల తేడాతో అపజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా 350కి పైగా పరుగులు చేయడం, రెండు సెంచరీల కలిపి భారీ స్కోర్లు నమోదు కావడం మ్యాచ్ తీవ్రతకు అద్దం పట్టింది.

రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించినప్పటికీ భారత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. 110 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, ఏడు మెరుపు బౌండరీలతో 138 పరుగులు బాదాడు హిట్ మ్యాన్. లాఫ్డెడ్, హుక్, లాంగ్, స్వీప్, కవర్ డ్రైవ్.. ఇలా దాదాపు అన్ని షాట్లతో రెచ్చిపోయాడు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుని ఐకాన్‌గా నిలిచాడు. లార్డ్స్ లో వన్డే సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌.. రోహిత్ శర్మే.

No Noise Means No Fun Rohit Sharma Ends Future Speculation After England 2-1 Win Sticks to Focus

వన్డే సిరీస్ ఓటమి అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. తన రిటైర్మెంట్ పుకార్లపై స్పందించాడు. తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను తేలిగ్గా తీసుకున్నాడు. వాటిని కొట్టిపారేశాడు. దేశం కోసం రాణించడమే ఓ క్రికెటర్ గా తన బాధ్యత అని స్పష్టం చేశాడు. తన భవిష్యత్ గురించి వస్తోన్న వ్యాఖ్యలు విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేని, క్రీడా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రచారాలు సహజమేనని, ఆట ద్వారా మాత్రమే వీటికి సమాధానం ఇస్తానని పేర్కొన్నాడు.

కెరీర్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచే తన చుట్టూ ఇటువంటి వాతావరణం ప్రచారంలో ఉందని, అవి లేకపోతే ఎంటర్టైన్మెంటే ఉండబోదని నవ్వుతూ చెప్పాడు. విరాట్ కోహ్లీతో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి రోహిత్ మాట్లాడాడు. కెరీర్ ప్రారంభం నుండే కలిసి ప్రయాణిస్తోన్నామని, క్రీజ్ లో ఉన్నప్పుడు ఒకరి వ్యూహాలను ఒకరు పంచుకుంటూ బ్యాటింగ్ చేస్తుంటామని, అది విజయానికి దోహదపడుతుందని వివరించాడు.

లార్డ్స్ వన్డే ఓటమిపై రోహిత్ శర్మ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులోని యువ బౌలర్లకు వన్డే ఫార్మాట్‌లో తగినంత అనుభవం లేదని, వారు రాణించడానికి మరికొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తు సిరీస్‌లలో ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనలో లభించే కఠిన సవాళ్లు ఓ క్రికెటర్‌గా తనకు ఎంతో సంతృప్తిని ఇస్తాయని వ్యాఖ్యానించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+