తల్లికి వందనం నిధుల జమ వేళ ఏపీ స్కూల్స్ లో వాటిపై నిషేధం!
త్వరలో తల్లికి వందనం నిధులు తల్లిదండ్రుల ఖాతాలలో జమ చేస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలురు అందరికీ ఒకే తరహా హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
విద్యార్థులందరికీ ఏకరూప హెయిర్ స్టైల్
సినిమాల ప్రభావంతో విద్యార్థులు రకరకాల హెయిర్ స్టైల్స్ తో స్కూల్ కి రావడం గమనించిన విద్యాశాఖ పిల్లలలో డిసిప్లిన్ పెంచడం కోసం, విద్యార్థులంతా సమానం అనే భావనను పెంపొందించడం కోసం, విద్యార్థులలో క్రమశిక్షణ కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఏకరూప హెయిర్ స్టైల్ పాటించాలని సూచించింది.

రకరకాల హెయిర్ స్టైల్స్ కి ఎట్రాక్ట్ అవుతున్న విద్యార్థులు
ప్రస్తుతం పాఠశాలలో కొంతమంది విద్యార్థులు సినిమా హీరోల హెయిర్ స్టైల్స్, సెలబ్రిటీల హెయిర్ స్టైల్స్, క్రికెట్ ప్లేయర్ల హెయిర్ స్టైల్స్ ను అనుకరిస్తున్నారు.అంతే కాదు రకరకాల రంగులు కూడా వేస్తూ స్పైక్స్, ముల్లెట్, ఫేడ్ ప్యాట్రన్ లు, ఎక్స్ ట్రీం ఫేడ్ ప్యాట్రన్ వంటి హెయిర్ స్టైల్స్ ను ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది.
ట్రెండీ హెయిర్ స్టైల్స్ పై నిషేధం
ఈ క్రమంలో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తింటుందని భావిస్తున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా విద్యార్థులు అందరికీ ఏక రూప హెయిర్ స్టైల్ నిబంధన తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రెండీ హెయిర్ స్టైల్స్ పై నిషేధం విధించారు. విద్యార్థులు ఎవరూ అలాంటి హెయిర్ స్టైల్ తో రాకుండా పూర్తిగా నిషేధం విధించారు.
స్కూల్స్ కు ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ
ఏకరీతి హెయిర్ స్టైల్ తోనే విద్యార్థులు రావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ కు వర్తింప జేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు టీచర్స్ ఈ నిబంధనను కఠినంగా అమలు చెయ్యాలని ఆదేశించారు. ఈ చర్య కారణంగా విద్యార్థులలో చదువుపై ఏకాగ్రత కుదురుతుందని, అనవసరమైన పోటీ తగ్గుతుందని, అందరూ సమానంగా చదువుకుంటారని భావిస్తున్నారు. మరి ప్రభుత్వ ఆలోచన ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications