మగరాయుడిలా శోభిత ..అక్కినేని కోడలు ఇంత పని చేసింది ఏంటి..!
అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు.నాగ చైతన్య- శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్‌గానే జరిగింది.
పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు.తండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు. దీంతో వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చిన హానీమూన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేశారు.

ఇటీవలే వీరిద్దరు హానీమూన్‌కు సంబంధించిన ఫొటోలు , వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా వీరిద్దరు ప్రఖ్యాత 'వోగ్' మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చారు.ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు.మగరాయుడిలా శోభిత పైన కూర్చుంటే .. ఆడపిల్లలా నాగ చైతన్య కింద కూర్చున్నాడని మీలో ఎవరు భర్తనో ఎవరు భార్యనో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, నాగ చైతన్య బ్యూటిఫుల్.. శోభిత సో హ్యాండ్సమ్ అంటూ మరికొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు , వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరో వైపు నాగ చైతన్య తండేల్ సక్సెస్ కావడంతో, తన తర్వాత సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. విరూపాక్ష సినిమాకు దర్శకత్వం వహించినది కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమా చేయడానికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీంతో శోభితా ధూళిపాళ సైతం తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. శోభితా ధూళిపాళ తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంది. పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ తొలి సారిగా కెమెరా ముందుకు వచ్చారు. తాజాగా, ఈ బ్యూటీ తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది.షూటింగ్ స్పాట్‌లో శోభిత ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications