విడాకులు తీసుకున్నా.. సమంత కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగచైతన్య
తెలుగు సినీ పరిశ్రమలో చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకోవడమేకాదు.. అందరి అభిమానాన్ని చూరగొన్నారు నాగచైతన్య-సమంత జంట. హఠాత్తుగా విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటన చేసి అభిమానుల గుండెలను బద్ధలు చేశారు. తిరిగి ఎప్పటికైనా కలవబోతారా? అని ఆశగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు షాక్ ఇస్తూ నాగచైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నారు. నాలుగోతేదీ రాత్రి అన్నపూర్ణ స్టూడియంలో ఎంతో నిరాడంబరంగా, కేవలం 300 మంది అతిథుల మధ్య వీరి వివాహం జరగబోతోంది. పెళ్లికి నాగచైతన్యకు రెండున్నర కోట్లరూపాయల విలువైన కారును నాగార్జున బహుమతిగా ఇచ్చారు.
ప్రతిరోజు ఏదో ఒక వార్త ఉంటుంది
సమంత మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటూ సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె నటించిన హనీబన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది. అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సందర్భంగా ఇటీవలే ముంబయిలో టీం పార్టీ ఇచ్చింది. అందులో పాల్గొన్న సమంత-వరుణ్ ధావన్ మంచి డ్యాన్స్ తో ఆహుతులను అలరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓవార్త వైరలవుతోంది. వాస్తవానికి నాగచైతన్య, సమంతకు సంబంధించిన వార్త లేకుండా సోషల్ మీడియా ఉండదు. ప్రతిరోజు వారిపై ఏదోఒక వార్త ఉంటూనే ఉంటుంది.

ఆమె జ్ఞాపకాల్లో నాగచైతన్య
సమంతతో విడిపోయినప్పటికీ నాగచైతన్య ఆమె జ్ఞాపకాల్లోనే ఉన్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. విడిపోయినప్పటికీ సమంతకు ఇష్టమైన పనులను చైతూ చేస్తున్నాడంట. సమంత ఉన్నప్పుడు చెట్లను నాటి జాగ్రత్తగా సంరక్షించేది. ఆమె చెట్లు అంటే ప్రాణం. ఆ చెట్లను ఇప్పటికీ నాగచైతన్య ఎంతో ఇష్టంగా సంరక్షిస్తున్నాడు. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని చెప్పొచ్చు. వాస్తవానికి ఏ జంటైనా విడిపోయిన తర్వాత వారికి సంబంధించిన వస్తవులేవీ జ్ఞాపకాలుగా లేకుండా తీసేస్తారు.
కానీ నాగచైతన్య మాత్రం సమంతకు గుర్తుగా చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడేందుకే శోభితను పెళ్లి చేసుకుంటున్నాడా? అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరి మన్ననలను చూరగొన్న జంట మాత్రం విడిపోయి అక్కినేని కుటుంబంలో, సమంత కుటుంబంలో కూడా నిరాశను నింపింది.












Click it and Unblock the Notifications