చైతూపై శోభిత ఫైర్.. పెళ్లయిన కొద్దిరోజులకే ఏమైంది?
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. గతంలో ఎన్నడూ చేయని సరి కొత్త పాత్రలో చైతూ, డీగ్లామర్ లుక్స్‌లో సాయి పల్లవి కనిపించనున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
అయితే నిన్నరాత్రి జరిగిన తండేల్ ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. మాట్లాడేందుకు స్టేజీపైకి వచ్చిన చౌతూకు యాంకర్ సుమ ఓ టాస్క్ ఇచ్చింది. తండేల్ మూవీలోని ఏ సాంగ్ ను కానీ డైలాగ్ కానీ మీ భార్యకు డెడికేట్ చేస్తారు?.. అని అడగ్గా.. బుజ్జితల్లి పాటను తన సతీమణి శోభితకు డెడికేట్ చేస్తానని చెప్పుకొచ్చారు.

" శోభితను ఇంట్లో ముద్దుగా "బుజ్జితల్లి" అని పిలుస్తాను. ఆ పేరు శోభితకు ఎంతో ప్రత్యేకం. తండేల్ మూవీలోని బుజ్జితల్లి సాంగ్ ను తనకు అంకితం చేస్తున్నాను. అయితే బుజ్జితల్లి అనే పదాన్ని పాటలో వాడటంపై శోభిత ఫుల్ సీరియస్ అయింది." అని చైతూ తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చాడు.
మరోవైపు దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. "శోభిత- చైతూ మ్యారేజ్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు నా నిక్ నేమ్ బుజ్జితల్లి అని శోభిత నాతో చెప్పింది. అదే పదాన్ని ఇక్కడ వాడామని అన్నారు.
సమంతతో విడాకుల అనంతరం చైతూ- శోభిత డేటింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. ఆగస్టు 8, 2024లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అక్కినేని నాగార్జున తెలిపారు. డిసెంబర్ 4, 2024లో వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో సంప్రదాయ పద్దతిలో జరిగింది.
తండేల్ కథ ఇదే..
శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన స్టోరీ లైన్‌పై ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు చందూ ఓ ఆసక్తికర విషయం షేర్ చేశాడు. ఈ చిత్రంలో ఓ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు ఏకంగా రూ.18కోట్లు ఖర్చు చేశారట.












Click it and Unblock the Notifications