మొన్న శోభితతో ఉన్నాడు..ఈ రోజు సమంతతో కనిపించాడు.. ఏం జరుగుతుంది రా సామి
హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే.హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు.

నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్‌తో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.అయితే పెళ్లి తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు.అయితే వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సమంత, నాగ చైతన్య కలిసి ఉన్నప్పుడు ఓ కుక్కను ప్రేమగా పెంచుకున్నారు. దాని పేరు హ్యాష్. సమంత, నాగ చైతన్య విడాకుల తర్వాత హ్యాష్ ఎవరి దగ్గర ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నం అయింది.
అయితే హ్యాష్ నాగ చైతన్య దగ్గరే ఎక్కువగా కనిపించింది. దీంతో సమంత హ్యాష్‌ను వదిలేసిందనే అంతా భావించారు.ఇటీవల శోభితతో హ్యాష్ కనిపించింది. అయితే తాజాగా హ్యాష్ సమంతతో కూడా దర్శనం ఇచ్చింది.ఈ క్రమంలో శోభిత ఈ మధ్యనే హష్‌తో ఇంస్టాగ్రామ్ లో ఫొటోలు పెట్టిన సంగతి తెలిసిందే. పచ్చగా ఉండాలి అంటే నీళ్లు పోయాలి అనే క్యాప్షన్ కూడా పెట్టింది. సమంత పక్కన హష్ కూర్చుని ఎంతో ప్రేమగా కనిపించింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications