నిశ్చితార్థం జరిగినా సమంత ఫొటో దాచుకున్న నాగచైతన్య

ఏమాయ చేశావే సినిమా చేశారు... ఆ సినిమా నుంచి ప్రేమలో పడ్డారు.. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు... తర్వాత మాత్రం వారిద్దరే నిర్ణయం తీసుకొని విడిపోయారు. ఇక్కడ పెద్దల మాటలను వినలేదు. వారెవరనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్య-సమత జంట. విడిపోయిన తర్వాత ఆగస్టు ఎనిమిదోతేదీన నాగచైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకా వివాహ తేదీని ప్రకటించలేదు. సమంత మాత్రం హనీబన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. మధ్యలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై బురద జల్లుతూ ఆ బురదను నాగార్జున కుటంబానికి కూడా అంటించారు.

షాక్ ఇచ్చిన నాగచైతన్య
విడాకులు తీసుకోవడానికి ముందే సమంత సోషల్ మీడియాలో నాగచైతన్య ఫొటోలను తొలగించడంతో విషయం అందరికీ అర్థమైంది. అయితే నాగచైతన్య మాత్రం సమంత ఫొటోలు తొలగించలేదు. శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత మాత్రం అన్నీ తీసేసి ఒక్క ఫొటోను మాత్రం ఉంచారు. తాను సమంతతో కలిసివున్న ఫొటో అది. అభిమానులు వీరిద్దరూ తిరిగి కలవాలని కోరుకుంటుండగా శోభితతో నిశ్చితార్థం జరుపుకొని నాగచైతన్య షాక్ ఇచ్చాడు. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి కూడా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం వైరలవుతూనే ఉంది.

Naga Chaitanya who hid the photo of Samantha even after the engagement with sobhita dhulipala

మంచి పని చేశావంటూ కామెంట్లు
ఇన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో దాచుకున్న సమంత ఫొటోను నాగచైతన్య తాజాగా డిలిట్ చేసినట్లు తెలుస్తోంది. ''త్రో బ్యాక్. మిసెస్ అండ్ గర్ల్ ఫ్రెండ్'' అనే క్యాప్షన్‌తో ఉన్న ఓ ఫొటోను తొలగించాడు. దీంతో మొత్తానికి నాగచైతన్య ఎన్నాళ్టకో ఓ మంచి పని చేశాడంటూ సమంత అభిమానులు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నారు నాగచైతన్య. సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నప్పటికీ పోటీ ఎక్కువగా ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ దీన్ని వాయిదా వేశారు.

విడుదల తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మత్స్యకారుడి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+