'చాలా సంతోషకరమైన సందర్భం ఇది'.. నాగబాబు సంచలన ట్వీట్

మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తె నిహారికపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించడంపై నాగబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక అద్భుతం చేసింది. ఆమె నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు చిత్రం సత్తా చాటింది. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ అవార్డు దక్కించుకుంది. ఈ విషయంపై నాగబాబు ట్వీట్ చేశారు. ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే.. సినిమా యూనిట్‌ కు అభినందనలు తెలిపారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Nagababu Congratulates Niharika Konidela as Committee Kurrollu Wins Gaddar Award

మెగా వారసురాలు నిహారిక కొణిదెల తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కమిటీ కుర్రోళ్లు మూవీ బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ కలెక్షన్లు కూడా ఈ మూవీ రాబట్టి సత్తా చాటింది. అయితే తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక గద్దర్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.

ఇదే విషయంపై నాగబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. "గద్దర్ గౌరవాన్ని పెంపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు ప్రఖ్యాత ప్రజా కవి శ్రీ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌" అందజేయడం ద్వారా గద్దర్ గారి గౌరవాన్ని పెంపొందిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు.తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో కమిటీ కుర్రోళ్లు సినిమా రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకోవడం చాలా సంతోషకరమైన సందర్భం. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా అనిపించింది.

అంతే కాకుండా కమిటీ కుర్రోళ్లు చిత్ర దర్శకుడు యధు వంశీ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును కూడా అందుకోవడం ద్వారా అతనిలో ఉన్న నైపుణ్యానికి ప్రోత్సాహం లభించినట్లైంది. నేను తొలిసారిగా నిర్మించిన రుద్రవీణ సినిమాకు "జాతీయ సమైక్యతపై ఉత్తమ చలన చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు" లభించడం, అదే కోవలో ఇప్పుడు నా కూతురు నిహారిక నిర్మించిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్లు జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం సారూప్యమైన యాదృచ్చిక సంఘటన. అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక, దర్శకుడు యధు వంశీ, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరున ప్రత్యేక అభినందనలు. అని నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+