గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని జంట.. ఇక షూటింగ్ కు బ్రేక్..!!
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చైతూ, శోభితల రిలేషన్ 2022 లో మొదలైంది. 2021 లో నటి సమంతో విడాకుల తర్వాత వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. విదేశాల్లో వీరు కలిసి దిగిన ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అలా ఆగస్టు 2024 లో హైదరాబాద్ లో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. ఆ తర్వాత డిసెంబర్ 4, 2024న అత్యంత సన్నిహితుల మధ్య నాగచైతన్య, శోభిత వివాహం చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం నాగ చైతన్య వృషకర్మ అనే మైథలాజికల్ మూవీలో నటిస్తున్నాడు. అంతకుముందు తండేల్ తో భారీ విజయం అందుకున్న చైతూ.. ప్రస్తుతం ఈ డిఫరెంట్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. గ్లింప్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఇక ఈ మూవీని విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తిక్ దండు తెరకెక్కించాడు.
ఇక తాజాగా ఈ క్యూట్ కపుల్ ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు చైతూ- శోభిత.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ భద్రత మధ్య ఆలయానికి చేరుకున్న ఈ జంట.. అక్కడ కొంత సమయం గడిపి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో నాగచైతన్య సాంప్రదాయబద్ధంగా తెల్లటి చొక్కా, ధోతీ ధరించాడు. అలాగే శోభిత ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా మెరిసిపోయింది. ఇక అక్కడి అక్కినేని అభిమానులతో ముచ్చటించిన చైతూ.. చిరునవ్వుతో జై జగన్నాథ్ అనగా.. అక్కడి భక్తులు, ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఓ వైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న ఈ జంట.. కాస్త సమయం దొరికినా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications