చైతన్య - సమంత విడాకులపై నాగార్జున సోదరి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ఆరోజుల్లో సమంత, నాగచైతన్యనే గుర్తొచ్చేవారు. నాగ చైతన్య సరసన 'ఏ మాయ చేసావే' సినిమాతో సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, చివరకు అది ప్రేమగా మారింది. దీంతో వీరిరువురు పెద్దవారిని ఒప్పించి 2017లో ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన నాలుగు సంవత్సరాలకే మనస్పర్థల కారణంగా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.
ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆమె కారణంగానే విడాకులు జరిగాయి అంటూ పలు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం.. తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఇప్పటికీ తమ అభిమానులకు క్లారిటీలేదు, దీనిపై చాలా రూమర్స్ వచ్చాయి.

చైతూ అలా.. సామ్ ఇలా
సమంత ది ఫ్యామిలీమ్యాన్ సిరీస్ వల్లనే , ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారని కొందరు, చైతూ రిస్ట్రక్షన్స్ వల్లనే అని కొందరు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తూనే వచ్చారు. కానీ దీనిపై సమంత కానీ, చైతూ కానీ ఎప్పుడూ స్పందించలేదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తూనే పర్సనల్ లైఫ్ లో కూడా బిజీ అయిపోయారు. ఇక గత ఏడాది నవంబర్లో ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు.
కాగా సామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. డేటింగ్ వార్తలను మరింత నిజం చేసేలా కొంతకాలంగా ఆమె చేస్తున్న ప్రతి పోస్టులోనూ రాజ్ నిడిమోరుతో ఫోటోలను పోస్ట్ చేస్తుంది సామ్. అయితే తాజాగా ఈ నాగచైతన్య మేనత్త సుశీల వీరి డివోర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఏమన్నారంటే..?
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య మేనత్త నాగ సుశీల మాట్లాడుతూ.. సమంత, చైతూ మేము పెళ్లి చేసుకుంటాము అని అడిగినప్పుడూ మేము నో చెప్పలేదు. తర్వాత వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని, విడాకులు తీసుకుంటామని అడిగినప్పుడూ మేము నో చెప్పలేదు. వాళ్లను బ్లేమ్ చేయలేదు, వారి నిర్ణయాన్ని వారికే వదిలేసాం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' సినిమా ద్వారా కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా చైతూ చేసిన నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరి అక్కినేని అభిమానుల్లో ఊపు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో NC-24 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీ చేస్తున్నారు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.












Click it and Unblock the Notifications