న్యూ లుక్‌లో అదరగొట్టిన మహేష్ బాబు భార్య
తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ జోడీ ఎవరంటే అందరు ఠక్కున చెప్పేది ..సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్‌ల పేర్లే. పెద్దలను ఎదిరించి మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్య నమ్రత లేకుండా మహేష్ పెద్దగా బయటకు కూడా రారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియా అనే సంగతి అందరికి తెలిసిందే. తరువాత పలు చిత్రాల్లో నమ్రత హీరోయిన్‌గా నటించి మెప్పించింది. మహేష్ బాబుతో వంశీ సినిమాలో హీరోయిన్‌గా చేసింది.
ఈ సినిమా షూటింగ్ సమమయంలోనే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో పడటం జరిగింది. పెద్దలను ఒప్పించి మరి ఇరువురు 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ .. ఫ్యామిలీకి మహేష్ ఇచ్చే విలువ మరే హీరో కూడా ఇవ్వరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. షూటింగ్య మధ్యలో గ్యాప్ దొరికితే చాలు..మహేష్ భార్య , పిల్లలతో ఫారెన్ వెళ్తుంటారు.మహేష్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయింది నమ్రత.

కానీ అప్పుడప్పుడు స్పెషల్ ఫొటో షూట్స్ తో పాటు మహేశ్ తో పాటు స్పెషల్ ఫొటోస్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది నమ్రత. లేటెస్ట్ గా మరోసారి స్పెషల్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ధరించిన లాంగ్ డ్రెస్ లో మెరిసిపోతుంది. అలాగే జ్యువలరీస్ ఆభరణాలు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది నమ్రత. ప్రముఖ జ్యూవెలరీ డిజైనర్ నాగిని ప్రాసాద్ డిజైన్ చేసిన స్పెషల్ డిజైన్డ్ ఆభరాలతో ఈ తరం హీరోయిన్స్‌కు పోటీ ఇస్తోంది నమ్రతా శిరోద్కర్. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి మహేశ్‌తో ఏదైనా సినిమాలో తళుక్కున మెరిస్తే చూడాలని ఉందని, మిస్ ఇండియా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications