రామానాయుడు స్టూడియోను బ్యాన్ చేసిన బాలయ్య?

నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినిమా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడరు. అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్‌కు చెందిన స్టూడియోలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల వల్ల తన సినిమాకు ప్రతికూల టాక్ రావడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించారు. ఎంతటి అనుబంధం ఉన్నా సరే, వర్క్ క్వాలిటీ దెబ్బతింటే సహించని బాలయ్య, రామానాయుడు స్టూడియోస్‌లో తన సినిమాలకు సంబంధించిన ఎటువంటి పనులు జరగకూడదని కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు.

తనతో సినిమాలు చేసే నిర్మాత, దర్శకులకు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అద్భుతమైన కథతో రూపుదిద్దుకున్న సినిమా కేవలం సౌండ్ సిస్టంలో చీప్ క్వాలిటీ డిస్క్ లు వాడటంవల్లే, ఆ సినిమా ఆడకుండా పోయిందని బాలకృష్ణ బాధపడ్డారు. అందుకే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

Nandamuri Balakrishna Bans Work at Ramanaidu Studios Over Use of Substandard DTS Discs

డీటీఎస్ కొత్తగా వస్తున్న రోజుల్లో

అప్పట్లో 'డిజిటల్ థియేటర్ సిస్టమ్' (DTS) కొత్తగా వస్తున్న రోజులు. ఒరిజినల్ DTS డిస్కుల ధర సుమారు రూ. 3000 ఉండేది. అయితే, ఖర్చు తగ్గించుకోవడానికి కొన్నిచోట్ల కేవలం రూ. 100 కే దొరికే డూప్లికేట్ డిస్కులను వాడారు. దీనివల్ల థియేటర్లలో సినిమా నడుస్తున్నప్పుడు సౌండ్ బ్రేక్ అవ్వడం, ప్రేక్షకులు అసహనానికి గురవ్వడం జరిగింది. ఈ టెక్నికల్ గందరగోళం బాలయ్యకు, సురేష్ ప్రొడక్షన్స్‌కు మధ్య దూరాన్ని పెంచింది. ఈ విషయాన్ని శ్రీహరితో అయోధ్య రామయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు మహేష్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.

అరుణ్ ప్రసాద్ డైరెక్టర్ గా చేశారు

బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా చంద్ర మహేష్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారు. 'అడవి రాముడు' తరహాలో దట్టమైన అడవి, ఏనుగులు, గుర్రాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్లతో కూడిన కథ అది. బాలయ్యకు కూడా ఈ ఐడియా విపరీతంగా నచ్చింది. కానీ, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లేదా వారి స్టూడియో అనుబంధంతో ఆ సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేకపోవడంతో, ఆ కాంబినేషన్ కుదరలేదు. చంద్ర మహేష్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి రావడంతో, ఆ అవకాశం దర్శకుడు అరుణ్ ప్రసాద్‌ను వెతుక్కుంటూ వెళ్ళింది. అలా ఒక దర్శకుడికి చేజారిన అవకాశం మరొకరికి కెరీర్ బూస్ట్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+