‘అఖండ2’ బాలయ్య పారితోషికం.. మరీ ఇంత దారుణమా?
నందమూరి నటసింహం బాలకృష్ణ అగ్ర కథానాయకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా అత్యధిక విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. మొన్నటివరకు చిరంజీవి అగ్ర భాగాన నిలబడగా, ఇప్పుడు బాలయ్య ప్రథమస్థానంలో నిలబడ్డారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో వరుసగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డును నెలకొల్పాడు. త్వరలోనే మరో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకొని అత్యంత అరుదైన డబుల్ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నారు. అందుకనుగుణంగా కథలను, దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు.
రెండో కూతురు జోక్యంతో మారిన బాలయ్య జాతకం
వాస్తవానికి బాలయ్య కరోనాకు ముందు వరుసగా ఫ్లాప్స్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత బాలయ్య రెండో కూతురు తేజస్విని జోక్యం చేసుకొని ఎటువంటి కథలు, ఏ తరహా దర్శకులను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయాలను ఆమె కూడా ఇస్తున్నారు. దీంతో బాలయ్య జాతకం మారిపోయిందని చెప్పొచ్చు. తాజాగా మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 లో నటిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్ లో బాలయ్య ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అఖండ హిందీ వెర్షన్ కు యూట్యూబ్ లో వచ్చిన ఆదరణను బట్టి మరింత శక్తివంతంగా బోయపాటి అఘోరా పాత్రను తీర్చిదిద్దారు.

నిర్మాతలే పారితోషికాన్ని పెంచారు
ఈ సినిమా కోసం బాలకృష్ణ రూ.35 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారు. పారితోషికం విషయంలో నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే బాలయ్య దాన్ని గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే వీరసింహారెడ్డి నిర్మించి మైత్రీ మూవీస్, భగవంత్ కేసరి నిర్మించి సన్ షైన్, డాకూ మహారాజ్ నిర్మించిన సితార నాగవంశీ బాలయ్య అడగకుండానే పారితోషికాన్ని పెంచి ఇచ్చారు. ఇప్పుడు అఖండ2కు కూడా నిర్మాతలే రూ.35 కోట్లు ఇస్తుండటంతో వాటిల్లో నుంచే డబ్బు ఖర్చు చేసి సంగీత దర్శకుడు తమన్ కు ఖరీదైన కారును బాలయ్య బహుమతిగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications