బాలయ్యకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాతలు

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ తన సినిమా కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్‌మీద ఇప్పుడున్నారు. కరోనా సమయంలో విడుదలైన అఖండ, తర్వాత సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి, గతేడాది అక్టోబరు 19న విడుదలైన భగవంత్ కేసరితో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో ఎన్‌బీకే 109 సినిమాను చేస్తున్నారు. దీనికి ఇంకా పేరు ఖరారు కాలేదు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ బాగా ఆకట్టుకుంది. ఏపీ ఎన్నికలు రావడంతో షూటింగ్ కు బాలయ్య విరామం ప్రకటించారు.

బోయపాటి కచ్చితంగా హిట్ ఇస్తాడు
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది విజయ దశమికి లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశంది. బాబీతో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజండ్, అఖండ తర్వాత రాబోతున్న నాలుగో సినిమా. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలగడంతోపాటు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడనే నమ్మకం ఉంది.

nandamuri balakrishna latest movie remuneration details here

అందరికీ అందుబాటులో బాలయ్య
వాస్తవానికి తెలుగులోని సీనియర్ హీరోల్లో పారితోషికం పరంగా అందరికీ అందుబాటులో ఉండే హీరో బాలకృష్ణ. అటువంటి బాలయ్యకు వీరసింహారెడ్డి సినిమా చేసినందుకు మైత్రీ మూవీ మేకర్స్ వారు రూ.14 కోట్ల పారితోషికం ఇచ్చారు. తర్వాత చేసిన భగవంత్ కేసరికి ఆ చిత్ర నిర్మాత రూ.18 కోట్లు ఇచ్చారు.

సితార్ బ్యానర్ పై నిర్మితమవుతున్న బాబీ సినిమా చేసినందుకు నిర్మాతే బలవంతంగా బాలయ్య పారితోషికాన్ని రూ.30 కోట్లకు తీసుకువచ్చారు. దీంతో తర్వాత చేయబోయే బోయపాటి సినిమాకు నిర్మాతలు రూ.34 కోట్లు ఇస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బోయపాటి తర్వాత చేయబోయే చిత్రానికి పూర్తి నిర్మాతగా తేజస్విని ఉండే అవకాశం ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+