చిరంజీవి వద్దన్న కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ అగ్ర కథానాయకులుగా కొన్ని దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర కూడా వీరి సినిమాలు విడుదలైనప్పుడు పోటాపోటీగా యుద్ధం జరుగుతుంది. వీరిద్దరి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతుంటాయి. అందుకు తగ్గట్లుగానే సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి అభిమానుల మధ్య హోరాహోరీగా యుద్ధం నడుస్తుంటుంది. తమ హీరో గొప్ప అంటే.. తమ హీరో గొప్ప అని వాదులాడుకుంటుంటారు.

ముందుగా చిరంజీవికి కథ వినిపించిన కోడి రామకృష్ణ
చిరంజీవి, బాలకృష్ణకు సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన మంగమ్మగారి మనవడు సినిమా కథను ముందుగా చిరంజీవికి వినిపించారు. అయితే కథ నచ్చకపోవడంతో చిరంజీవి తిరస్కరించారు. దీంతో అదే కథను కోడి రామకృష్ణ బాలకృష్ణకు వినిపించగా వెంటనే సినిమాను భార్గవ్ ఆర్ట్స్ పతకాంపై ఎస్.గోపాల్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భానుమతి కీలకపాత్ర పోషించగా సుహాసిని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడమే కాదు. ఏకంగా 600 రోజులపాటు ప్రదర్శింపబడింది.

nandamuri balakrishna made mangammagari manavadu movie when chiranjeevi rejected

ఇప్పటికీ బాధపడుతున్న చిరంజీవి
సినిమా విడుదలై ఘనవిజయం సాధించన తర్వాత నుంచి ఇప్పటివరకు ఆ సినిమా చేయలేకపోయినందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో బాధపడుతుంటారు. తన సన్నిహితుల దగ్గర తరుచుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. వాస్తవానికి తన దగ్గరకు వచ్చిన కథలను చిరంజీవి తిరస్కరించడం ఎంతో అరుదుగా జరుగుతుంటుంది. కొన్ని కొన్ని నచ్చకపోయినా దర్శకుడితో మాట్లాడి వాటిల్లో మార్పు చేర్పులు చేపిస్తారు. అయితే కెరీర్ ప్రారంభంలో మంగమ్మ గారి మనవడు సినిమాను చేసుంటే ఇమేజ్ భారీగా పెరిగివుండేదని చిరంజీవి అభిప్రాయపడుతుంటారు. మంగమ్మగారి మనవడు సినిమా తర్వాత భార్గవ్ ఆర్ట్స్, గోపాల్ రెడ్డి, కోడిరామకృష్ణ, బాలకృష్ణ కాంబినేషన్ లో సంచలన విజయాలు సాధించిన చిత్రాలు అనేకం వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+