ఇదెక్కడి మాస్ రా మామ.. విశ్వక్ సేన్ "ఈ నగరానికి ఏమైంది" సీక్వెల్‌లో బాలయ్య !

'ఈ నగరానికి ఏమైంది?'.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ గా 2018లో విడుదలైన ఈ చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తరుణ్‌ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. విశ్వక్‌ సేన్‌, సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను కీలక పాత్రల్లో నటించారు. నలుగురు స్నేహితుల పర్సనల్ లైఫ్స్, ఫిల్మ్‌మేకింగ్ జర్నీ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫుల్ బజ్ నెలకొంది.

ఈ క్రమంలోనే రీసెంట్ గానే ఈ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ను 'ఈNఈ రిపీట్' పేరుతో రూపొందించనున్నట్టు దర్శకుడు తరుణ్ భాస్కర్ అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగంలో నవ్వులు పూయించిన ప్రధాన తారాగణం - విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను - మళ్లీ తమ పాత్రల్లో కనిపించనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేశ్‌ బాబు, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మరోసారి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

nandamuri-balakrishna-playing-guest-role-in-e-nagaraniki-emaindi-sequel

అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న మరో ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

కాగా విశ్వక్‌ సేన్‌ - బాలకృష్ణల మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో పాల్గొన్న విశ్వక్‌, బాలయ్యపై తన అభిమానాన్ని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరికను కూడా బహిరంగంగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ఈ సీక్వెల్ లో విశ్వక్‌ స్వయంగా బాలయ్యను ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయమని కోరడంతో.. ఆయన వెంటనే అంగీకరించారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం గ్యారంటీ అని భావిస్తున్నారు.

నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హై ఫామ్ లో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'భగవంత్ కేసరి', 'వీరసింహా రెడ్డి', 'డాకు మహారాజ్' వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం 'అఖండ 2' షూటింగ్‌తో బిజీగా ఉండగా.. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాను కూడా బాలయ్య అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+