నీకోసం నేనున్నా.. మంచు పంచాయతీ లోకి నారా అబ్బాయి

మంచు ఫ్యామిలీలో విభేదాలు కుటుంబాన్ని రోడ్డుకు లాగాయి. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గొడవలు, కేసులతో మొదలైన ఈ తతంగం ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గానే కామెంట్స్ చేసుకునే స్థాయికి చేరింది. ఒక వైపు విష్ణు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతుంటే.. మరోవైపు భైరవంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రేక్షకులను పలకరించనున్నాడు మనోజ్. ఇప్పుడు ఈ మూవీ ఈవెంట్ వేదికగా చోటుచేసుకున్న ఘటనలతో మంచు ఇష్యూలోకి ఇప్పుడు నారా వారి అబ్బాయి కూడా ఎంటర్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

భైరవం చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తుండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అలానే ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కే.కే.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో హిట్ కొట్టిన 'గరుడన్' సినిమాకు రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రానికి తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు.

nara-rohith-emotional-post-on-manchu-manoj-goes-viral

మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఏలూరులో నిన్న రాత్రి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర బృందం. ఈవెంట్ లో మంచు మనోజ్ జర్నీకి సంబంధించిన స్పెషల్ ఏవీ ప్రదర్శించారు. ఇది చూసి మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషన్ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో పక్కనే ఉన్న దర్శకుడు విజయ్ కనకమేడల ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేసారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అలానే మనోజ్ మాట్లాడుతూ.. సొంత వాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు తనపై ప్రేమ కురిపిస్తున్నారని మంచు మనోజ్ అన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతున్నప్పటికీ, ఫ్యాన్స్ కారణంగానే ఇంత గుండె ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కట్టు బట్టలతో రోడ్డు మీదకు వచ్చానన్నారు. కట్టె కాలేవరకు తాను మోహన్ బాబు కొడుకునేనని పేర్కొన్నారు. అంతే కాకుండా శివయ్య అంటే శివయ్య రాడని, ఇలాంటి అభిమానులు , డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలోనే శివయ్య వస్తాడని ఇన్ డైరెక్ట్ గా "కన్నప్ప" చిత్రంపై సెటైర్లు వేశారు.

అండగా నేనుంటా - నారా రోహిత్

ఈ కార్యక్రమంపై నారా రోహిత్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ లో.. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను పెద్ద సక్సెస్ చేసిన ఏలూరు ప్రజలకు చాలా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ కి ఇంత క్రేజ్ తీసుకురావడానికి కారణం మా బాబాయ్ మనోజ్. చాలా పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. ఆయన స్పీచ్ నాకు కూడా చాలా ఇన్స్పైర్ గా అనిపించింది. ఏదేమైనా ఎవరు అండగా ఉన్నా లేకపోయినా బాబాయ్ నేను నీకు అండగా ఉంటాను అంటూ రోహిత్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

మరోవైపు మంచు విష్ణు నటిస్తున్న నటిస్తున్న కన్నప్ప సినిమా.. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం యూఎస్ వెళ్లిన విష్ణు.. అక్కడ ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రక్తం పంచుకొని పుట్టినవాళ్లే నా పతనాన్ని కోరుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+