కొడుకు పేరును అధికారికంగా ప్రకటించిన నారా రోహిత్
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఇటీవల తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి శిరీష ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటివరకూ చిన్నారికి సంబంధించిన ఫొటోలు, పేరు తదితర వివరాలను వెల్లడించలేదు. ఈ మేరకు తాజాగా తమ కుమారుడి పేరును ప్రకటించారు నారా రోహిత్ దంపతులు. ఇందుకు సంబంధించిన నామకరణం ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఆ వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నారా రోహిత్ దంపతులు తమ కుమారుడికి నందన్ రామ నారా అనే పేరును పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో "ప్రేమ.. కృతజ్ఞత.. ఆనందంతో నిండిన హృదయాలతో మా అబ్బాయిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము.. మా చిన్నారి నందన్ రామ నారాకు స్వాగతం. నువ్వే మాకు గొప్ప ఆశీర్వాదం" అని రోహిత్ పోస్టు పెట్టారు.
అంతేకాక ఈ పేరుకు సంబంధించిన అర్థాన్ని కూడా వివరించారు నారా రోహిత్. నందన్ అనే పదానికి అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని అందించేవాడు అనే అర్థం వస్తుందని తెలిపారు. ఇక రామ అనే పదం తమ కుటుంబంలోని తాతగారి జ్ఞాపకార్థం, ఆయనకు గౌరవ సూచకంగా కుమారుడి పేరులో చేర్చినట్లు తెలిపారు. ఇక గతేడాది అక్టోబర్ 30 న నారా రోహిత్- శిరీష వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 23 న ఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఇక తాజాగా కుమారుడి పేరు ప్రకటన ఫంక్షన్ ఘనంగా నిర్వహించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు నారా రోహిత్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక నారా రోహిత్ ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక కెరీర్ బిగినింగ్ లో బాణం, సోలో, సారొచ్చారు, రౌడీ ఫెల్లో, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి, ప్రతినిధి 2, భైరవం, సుందరకాండ తదితర సినిమాల్లో నటించారు. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications
