సడన్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్

ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కూడా స్పష్టం చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నిప్పులు చెరిగే బంతులు విసురుతూ, భీకరమైన పేస్ తో దిగ్గజ బ్యాటర్లను సైతం వణికించిన ఈ స్పీడ్‌స్టర్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

సుమారు దశాబ్ద కాలం పాటు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ప్రధాన పేస్ అస్త్రంగా సేవలందించాడు మార్క్ వుడ్. సమకాలీన ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా తనదైన చెరగని ముద్ర వేశాడు. కెరీర్ పొడవునా గాయాల బారిన పడిన ప్రతిసారీ అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెట్ సాధించిన అత్యున్నత విజయాలలో మార్క్ వుడ్ కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాడు.

England star fast bowler Mark Wood announces his retirement from international cricket with immediate effect

2019లో ఇంగ్లాండ్ తొలిసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించాడీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఆ మెగా టోర్నమెంట్‌లో తన అద్వితీయ బౌలింగ్ తో ఏకంగా 18 వికెట్లు పడగొట్టాడు. జట్టును విజేతగా నిలిపడంలో తనవంత పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన ఇంగ్లాండ్ జట్టులో కూడా మార్క్ ఉడ్ సభ్యుడే. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 253 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్
టీ20ల్లో టీమిండియా రేర్ ఫీట్: మొట్టమొదటి జట్టు మనదే బాస్

టెస్టుల్లో 119, వన్డే ఇంటర్నేషనల్స్ లో 80 వికెట్లను సాధించాడు. టీ20ల్లో 54 వికెట్లను కూల్చాడు. టెస్ట్, పరిమిత ఓవర్ల ఫార్మట్ లల్లో తిరుగులేని ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించారు. మార్క్ వుడ్ తీసుకున్న ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఓ శకానికి తెరపడినట్టే.. ఓ సువర్ణాధ్యాయం ముగిసినట్టే. ఇంత హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.

పసికూనపై టీమిండియా విలవిల: టార్గెట్ 32 పరుగులే: అభిషేక్ గోల్డెన్ డక్
పసికూనపై టీమిండియా విలవిల: టార్గెట్ 32 పరుగులే: అభిషేక్ గోల్డెన్ డక్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+