నయనతార విఘ్నేశ్ శివన్ గొప్ప మనసు!
కేరళలోని వయనాడ్ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వయనాడ్ బాధితులకు అండగా సినీ ప్రముఖులు
కేరళలో జరిగిన ప్రకృతి విలయతాండవం పైన దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇక బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించడానికి సినీ ప్రముఖులు ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే కేరళ వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న, సూర్య, జ్యోతిక, సహా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాన్ని పంపించారు.

భారీ విరాళం ఇచ్చిన నయనతార, విఘ్నేశ్ లు
సూర్య, జ్యోతిక, కార్తీ లు కలిసి వయనాడ్ బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఇక తాజాగా తమిళ మహిళా సూపర్ స్టార్ నయనతార ఆమె భర్త కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతుగా 20 లక్షల రూపాయలను అందించారు .
నయనతార విఘ్నేశ్ ల లేఖ
ఈ క్రమంలో వారు తమ ఇద్దరు కుమారులతో పాటు వయనాడ్ లోని ప్రజల జీవితాలను పునర్ నిర్మించడానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఈ లేఖలో వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన విషాదకర ఘటన మా హృదయాలను కలచివేసింది అని పేర్కొన్నారు.
తక్షణ సాయం కోసం సహాయనిధికి 20 లక్షల రూపాయలు
ఈ ఘటనతో సమాజం అనుభవించిన విధ్వంసం నష్టాలు చాలా దయనీయంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సంఘీభావంగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయనిధికి 20 లక్షల రూపాయలు అందిస్తున్నామని నయనతార విఘ్నేశ్ తమ లేఖలో పేర్కొన్నారు. నయనతార స్వస్థలం కేరళ. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం కేరళలోని తిరువల్లాలో నివాసం ఉంటున్నారు. ఇక కేరళలో జరిగిన వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనకు స్పందించి మంచి మనసు చాటుకున్నారు అందాల తార నయనతార.












Click it and Unblock the Notifications