హరీష్ శంకర్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. రీజన్ అదే ?
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వివాదాలు ఎక్కువగా నడుస్తున్నాయి. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ నటించిన 'డ్రాగన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్‌కి డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ కూడా అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎస్‌కేఎన్ తెలుగు హీరోయిన్లపై చేసిన కామెంట్స్ పై విమర్శలు వస్తున్న తరుణంలో.. డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ పై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్ లలో చేస్తున్న కామెంట్స్ వారిని అనవసరంగా చిక్కుల్లో పడేస్తున్నాయి. రీసెంట్ గానే విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ రచ్చరచ్చ చేశాయి. సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో సైతం లైలా మూవీని బ్యాన్ చేయాలంటూ ఫైర్ అయ్యారు. ఇక డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ప్రేమిస్తుంటారు.. తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుద్దో మాకు తెలిసి వచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే సపోర్ట్ చేయాలని నేను, సాయి రాజేష్ ఫిక్స్ అయ్యాం అంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యానించారు. వీటిపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఇదే ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మన తెలుగు ప్రేక్షకులు మన సినిమాలు చూడరు.. కానీ బయట సినిమాలు మాత్రం బానే చూస్తారు. ముఖ్యంగా మంచి సినిమాలు చేసినా సరే తెలుగు ఆడియన్స్ మాత్రం తెలుగు సినిమాలను ఆదరించరు. ఇక ఇది వేరే ఇండస్ట్రీ సినిమా కాబట్టి కచ్చితంగా చూస్తారు అంటూ కాస్త వెటకారంగా కామెంట్లు చేశారు హరీష్ శంకర్. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారని అంటారు. కానీ తెలుగు సినిమాలను పక్కనపెట్టి వేరే భాష సినిమాలను ఆదరిస్తున్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ చివరిగా రవితేజతో చేసిన 'మిస్టర్ బచ్చన్' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. '
లవ్ టుడే సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రంగనాథ్. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా 'డ్రాగన్' అనే మూవీతో రాబోతున్నాడు ప్రదీప్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశ్వత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications