ఆపరేషన్ సిందూర్‌కు టార్గెట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ..ఇంత దారుణామా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన , డ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి, అనతి కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోలను వణికించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. వరుస హిట్లను సాధిస్తూ స్టార్ హీరోగా మారారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వచ్చారు. ఆయన్ను కొందరు నెటిజన్లు టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే... పహెల్గాం దాడి తర్వాత ఇండియాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు హిందువులా, ముస్లింలా అని అడిగి మరీ హిందువులను కాల్చి చంపారు.

దానికి ప్రతిచర్యగా భారత్ సైతం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై దాడి చేసింది. ప్రస్తుతం ఇండియా- పాక్ మధ్య యుద్ధం సాగుతుంది. ఇటువంటి తరుణంలో కొందరు దుర్మార్గులు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసుకుని అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం వ్యక్తి అని, అతను నందమూరి తారక రామారావుగా మార్చుకున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
— ℕ𝐢𝐭𝐞𝐬𝐡 𝐘𝐚𝐝𝐚𝐯 🚬 (@Fauji__01) May 8, 2025
" MOHAMMED SARIB RASOOL KHAN " pic.twitter.com/MH13E9BrfM
ఎన్టీఆర్ పేరు మార్చుకున్న తర్వాతే అతనికి సరైన గుర్తింపు వచ్చిందని, సినిమాల్లో కూడా స్టార్‌గా ఎదిగాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.ఆయన అసలు పేరు ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పేరును కూడా తెర మీదకు తీసుకువస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mini srk❤️🔥
— Rocklee⚡️🚁 (@RC_Cultzz) May 8, 2025
MOHAMMED SARIB RASOOL KHAN#RASOOLNATION pic.twitter.com/SeOXacBLVF
ఎన్టీఆర్‌పై కావాలనే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ స్టార్ హీరోపై ఇలా దారుణమైన ట్రోల్స్ చేయడాన్ని అభిమానులు తప్పు పడుతున్నారు. ఎన్టీఆర్ పలుమార్లు గుడికి వెళ్లిన సందర్భాలను కూడా వారు వెలికి తీసి నెటిజన్లకు కౌంటరిస్తున్నారు.












Click it and Unblock the Notifications