వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఫస్ట్ దీపావళి సెలబ్రేషన్స్- స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిహారిక

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండగ ఆనందోత్సాహాల మధ్య సాగింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకొంటారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

అమావాస్య ఘడియంలో ఉండటం వల్ల నేడు కూడా చాలా చోట్ల దీపావళి పండగను జరుపుకొంటోన్నారు. సోమవారం కావడం వల్ల శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు.

Newly married couple Varun Tej and Lavanya Tripathi celebrated their first Diwali 2023

టాలీవుడ్‌లో దీపావళి సందడి ఏర్పడింది. సెలెబ్రిటీలందరూ ఈ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొంటోన్నారు. ఫిల్మ్ నగర్‌లో సందడి నెలకొంది. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్ల ఇళ్లన్నింటినీ విద్యుద్దీపాలతో అలంకరించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహిస్తోన్నారు.

Newly married couple Varun Tej and Lavanya Tripathi celebrated their first Diwali 2023

టాలీవుడ్ టాప్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. దీపావళి సెలబ్రేషన్స్‌కు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం ఆ నలుగురు కూడా తమ నెక్ట్స్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటోన్న విషయం తెలిసిందే. దీపావళి కావడంతో అందరూ ఒకేచోటికి చేరి, సెలబ్రేట్ చేసుకున్నారు.

Newly married couple Varun Tej and Lavanya Tripathi celebrated their first Diwali 2023

కొత్త దంపతులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. వారికి ఇదే తొలి దీపావళి. తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, చెల్లెలు నిహారికతో కలిసి వారు దీపావళిని జరుపుకొన్నారు. రెడ్ కలర్ శారీలో నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది ఈ వేడుకల్లో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+