యాంకర్ సూసైడ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి..మొత్తం అతనే వల్లే ..?
హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం (జూన్ 27, 2025) రాత్రి 10:30 గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్వేచ్ఛ గత కొన్నేళ్లుగా పలు ప్రముఖ న్యూస్ ఛానెల్స్‌లో జర్నలిస్టుగా, యాంకర్‌గా పని చేశారు. ఐదేళ్ల క్రితం ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నారని, తన కూతురుతో పాటు పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటున్నారని తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు రాంనగర్‌లో నివసిస్తున్నారు. కూతురు మరణంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేశారు.
తమ కూతురు చనిపోవడానికి ప్రధాన కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తేనని అన్నారు. భర్తతో విడిపోయాక తన కూతరు అతడితోనే కలిసి ఉంటోందని తెలిపారు. వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో పూర్ణచంద్ర రావుతో కలిసి ఉండలేను నాన్న అంటూ తన కూతురు జూన్ 26న చెప్పిందని అన్నారు.
స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడని ఆరోపించారు. ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని.. అందుక కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలి స్వేచ్చ తండ్రి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications