తాను ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించిన నిహారిక
మెగా బ్రదర్ నాగబాబా గారాల తనయ నిహారిక ప్రస్తుతం సినిమాలు తీస్తూ నిర్మాతగా స్థిరపడాలనుకుంటోంది. ఇటీవలే చిరంజీవి విశ్వంభర చిత్రంలోని ఓ పాటలో షూటింగ్ లో పాల్గొంది. ఈ పాటలో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ఇటీవలే నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా సంచలన విజయం సాధించింది. ముందుగా హీరోయిన్ గా, తర్వాత వెబ్ సిరీస్ ల్లో నటించిందికానీ చివరకు నిర్మాతగా స్థిరపడింది. జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయిన తర్వాత కొన్నాళ్లు వేదాంతం వల్లించిందికానీ తర్వాత కెరీర్ పరంగా బిజీ అవుతోంది.
మా మధ్యలోకి నువ్వు రావొద్దు..
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే నిహారిక తనకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఓ స్టోరీని షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. తాను అతడిని ప్రేమిస్తున్నామని నేరుగా చెప్పేసింది. అంబటి భార్గవి.. దయచేసి నువ్వ మా ఇద్దరి మధ్య అడ్డుగోడలా ఉండొద్దని, మా స్నేహం మధ్యలోకి నువ్వు రావొద్దని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. థాంక్స్.. బై.. బై.. అని రాసుకొచ్చింది. మైనర్ పాస్ పోర్ట్ అనే హ్యాండిల్ ద్వారా తన గురించి రాసిన నోట్ ప్యాడ్ ను షేర్ చేసింది. ఇంతకీ ఆ ఖాతా ఎవరిది అని ఆరా తీస్తే ఒక చిన్న బాబుది అని తేలింది. చిన్నపిల్లలతో సరదాగా గడిపే నిహారికకు చిన్నారులంటే ఎంతో ఇష్టం. వారితో కలిసినప్పుడు ఈ లోకాన్ని మర్చిపోతుంటానని చెబుతూ ఉండేది.

మెగా హీరోలు ఈ విషయాన్ని గమనించాలి
విశ్వంభర చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన షూటింగ్ లో నిహారికతోపాటు సాయిధరమ్ తేజ్ పాల్గొనడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. చిరంజీవి ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ను మానుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారంతా కలిసి సినిమాలు చేస్తే మిగతావారి పరిస్థితి ఏమిటని, చూసే ప్రేక్షకులకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటుందంటున్నారు. చిరంజీవి ఈ విషయాన్ని గమనించాలని, ఫ్యామిలీ ప్యాకేజ్ ఆపాలని కోరుతున్నారు. మెగా హీరోలు ఏ సినిమా చేసినా, ఏ సినిమా ఫంక్షన్ కు హాజరైనా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందనే విషయాన్ని గమనించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications