కొణిదెల నీహారిక డేరింగ్ స్టెప్
నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నాగబాబు కుమార్తె నీహారిక డేరింగ్ స్టెప్ వేశారు. తొలిసారిగా నిర్మాతగా మారి సినిమాను నిర్మిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా సినిమా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా.. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మొదటి సన్నివేశానికి వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అల్లు అరవింద్ అందజేశారు. కొత్త జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటివరకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలింస్ చేశామని, తొలిసారిగా సినిమా ప్రారంభించినట్లు నీహారిక వెల్లడించారు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నామన్నారు. సంతోషంగా ఉండటంతోపాటు మరోవైపు టెన్షన్ గా ఉందన్నారు.

మంచి టీమ్, మంచి కాన్సెప్ట్ తో సినిమా రాబోతోందని, తెలుగు ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని భావిస్తున్నామన్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు యదు వంశీ తెలిపారు. ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తున్నామని, తనకు కల్పించిన అవవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాను నిర్మించాలనే ఉద్దేశంతో తాను, తన శ్రీమని నిర్మాతలుగా మారినట్లు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి తెలిపారు.












Click it and Unblock the Notifications