ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

చాలా సినిమాలు వస్తాయి.. హిట్ అవుతాయి.. కలెక్షన్స్ రాబడతాయి.. పోతాయి.. ఇంకొన్ని సినిమాలు ప్లాఫ్ అవుతుంటాయి. అయితే చాలా తక్కువ సినిమాలు మాత్రమే ట్రెండ్ సెట్టర్ గా మిగులుతుంటాయి. ఆ కోవకు చెందిన సినిమానే తెలుగులో అర్జున్ రెడ్డి. ఈ మూవీ టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ సెన్సేషన్. అప్పటి వరకూ ఉన్న మూస కథలను బ్రేక్ చేస్తూ ఓ విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది ఈ చిత్రం. ఈ మూవీతో అటు విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు. ఇప్పుడు వాళ్లు ఏం రేంజ్ లో ఉన్నారో మనకు తెలిసిందే.

అయితే టాలీవుడ్ లో బోల్డ్ మూవీస్ రావడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ అన్ని సినిమాలు హిట్ కాలేక ప్లాఫ్స్ గానే మిగిలిపోతుంటాయి. అలా తెలుగులో ఇటీవల వచ్చిన రొమాంటిక్ మూవీ 'నిలవే'.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మూవీ ఏప్రిల్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

Nilave Bold Telugu Film Set for OTT Release on ETV Win from April 9th Nilave OTT release Nilave

ఇక ఈ సినిమాలో సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ హీరోహీరోయిన్లుగా న‌టించి మెప్పించారు. 'నిల‌వే' మూవీకి సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హ‌ర్ష చెముడు, సుప్రియా ఐసోలా, జీవ‌న్ కుమార్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నిలవే మూవీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను చాలామంది అర్జున్ రెడ్డి మూవీతో కంపేరింగ్ చేశారు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ తో పాటు బోల్డ్‌, రొమాంటిక్ సీన్లు అర్జున్ రెడ్డిని గుర్తుచేస్తున్నాయంటూ నెటిజ‌న్లు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. అయితే ఈ మూవీ అర్జున్ రెడ్డి రేంజ్ లో హిట్ అవ్వలేక పోయింది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 9 న ఓటీటీ వేదిక అయిన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+