థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి తెలుగు హీరో సినిమా
సాధారణంగా సినిమా విడుదలైన నెల రోజుల వరకు ఓటీటీలకు విడుదల చేయకూడదనే రూల్ ఉంది. అయితే ఓ సినిమా థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.ఆ సినిమా మరేదో కాదు..నితిన్ నటించిన 'తమ్ముడు'. జులై 4న ఈ సినిమా విడుదలైంది. తమ్ముడు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్ మీద తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇంకా చెప్పాలంటే నితిన్ సినిమాలను జనాలు చూడటం మానేశారేమో అనిపిస్తోంది. దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. ఈ సినిమా కలెక్షన్లు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మొదటి మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే, నాలుగో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 16 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి.

మొత్తంగా, నాలుగు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 42 లక్షల రూపాయల షేర్ వసూళ్లు నమోదయ్యాయి. ఐదవ రోజు పరిస్థితి మరింత దిగజారిందని, హైదరాబాద్ వంటి టాప్ సిటీలో థియేటర్ల అద్దెలను కూడా తిరిగి సంపాదించుకోలేకపోయింది. ఈ గణాంకాలు సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదని స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రైట్స్‌ను దక్కించుకున్నట్టు సమాచారం. ఆగస్టు 1న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. సినిమా విడుదలై నెల రోజులు కాకుండానే తమ్ముడు సినిమా ఓటీటీకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications