CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ.. మ్యూజిక్ షోకు రావాలని ఆహ్వానం..
సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కలిశారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ తో పాటు వచ్చారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ ను కూడా కలిశారు. దేవిశ్రీ ప్రసాద్ అక్టోబర్ 19న శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ మ్యూజిక్ ఈవెంట్ కు రావాలని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని దేవిశ్రీ ఆహ్వానించారు. హైదరాబాద్ లో మ్యూజిక్ ఈవెంట్ నిర్వహిస్తామని దేవి రెండు నెలల క్రితమే ప్రకటించారు.
ఇన్ స్టాగ్రామ్ లో ఆగస్ట్ 19న పోస్ట్ పెట్టాడు. డీఎ్సపీ లైవ్ హైదరాబాద్ అని పోస్ట్ పెట్టాడు. అప్పటి నుంచి ఈవెంట్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాడు. ఈ ఈవెంట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దేవిశ్రీ గతంలో అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, యూఏఈ, లండన్ తోపాటు పలు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. హైదరాబాద్ లో జరగబోయే ఈ ఈవెంట్ శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈ మ్యూజిక్ షోకు వెళ్లాలంటే డబ్బులు పే చేయాలి. ఒక్క టికెట్ రూ.999 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.ఈ షోకు ఒక టికెట్ కొనుగోలు చేస్తే మరొక టికెట్ ఫ్రీ అని ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ పేర్కొంది. మీరు 1 టిక్కెట్‌ని కొనుగోలు చేస్తే, మీకు మొత్తం 2 లభిస్తాయని వివరించింది.టికెట్ కొనుగోలు చేసిన వారు సాయంత్రం 4 గంటల నుంచి లోపలికి వెళ్లొచ్చు. ఈ ఈవెంట్ లో పాల్గొనాలంటే.. కనీసం 5 సంవత్సరాలు ఉండాలి.
దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2: ది రూల్, సూర్య కంగువ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, నాగ చైతన్య తాండల్, ధనుష్ కుబేర చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.












Click it and Unblock the Notifications